పూరీకి బంపర్ ఆఫర్ తగిలింది..!

ఫ్లాప్స్ లో కొట్టుకుపోతున్న పూరి జగన్నాధ్ కి ఇప్పుడొక బంపర్ ఆఫర్ తగిలింది. పూరి జగన్నాధ్.. రామ్ తో ఒక సినిమా, విజయ్ తో ఒక సినిమా [more]

Update: 2018-12-25 07:17 GMT

ఫ్లాప్స్ లో కొట్టుకుపోతున్న పూరి జగన్నాధ్ కి ఇప్పుడొక బంపర్ ఆఫర్ తగిలింది. పూరి జగన్నాధ్.. రామ్ తో ఒక సినిమా, విజయ్ తో ఒక సినిమా చేస్తున్నాడనే న్యూస్ గత రెండు మూడు నెలలుగా ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరిగింది. అయితే ఎక్కడో ఏదో డౌట్.. రామ్ పూరికి ఛాన్స్ ఇచ్చాడా..? అసలు సూపర్ హిట్ హీరో విజయ్ దేవరకొండ పూరికి ఛాన్స్ ఇవ్వడమా..? అనే డౌట్స్ సోషల్ మీడియాలో బయలుదేరాయి. అయితే విజయ్ దేవరకొండ తో పూరి సినిమా ఏమో తెలియదు కానీ.. రామ్ తో మాత్రం పూరి జగన్నాధ్ సినిమా ఆఫీషియల్ గా ఫిక్స్ అయ్యిపోయింది.

పిలిచి అవకాశం ఇచ్చిన రామ్…

ఎప్పటికప్పుడు కొత్త దర్శకులతో సినిమాలు చేసే రామ్ ఇప్పుడు ఇలా ఫ్లాప్ దర్శకుడికి ఛాన్స్ ఇచ్చేసాడు. మరి గత కొంతకాలంగా హిట్ అనే పదానికే దూరమైన పూరి జగన్నాధ్ కి రామ్ పిలిచి అవకాశం ఇవ్వడం అంటే గొప్పే. కాకపోతే పూరి జగన్నాధ్ హీరోలను కొత్తగా చూపించడంలో మాత్రం ఎప్పుడూ ముందుంటాడు. మరి పూరికి టైం బాగోలేక కానీ.. లేదంటే పూరి డైరెక్షన్ లో హీరోలు సినిమాలు చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తారు. అయితే పూరి జగన్నాధ్ కి నిర్మాత దొరకలేదేమో.. అందుకే ఇప్పుడు రామ్ సినిమాని పూరి టూరింగ్ టాకీస్ పై తెరకెక్కిస్తున్నాడు.

మే వరకు పూర్తి చేస్తాడట…

ఇక పూరి డైరెక్షన్ గురించి తెలిసిందే. అందుకే రామ్ సినిమాని కూడా జనవరిలో మొదలు పెట్టేసి మే వరకు ఫినిష్ చేసి విడుదల చేసే ప్లాన్ లో పూరి ఉన్నాడట. ఇక ఈ మధ్యన హలో గురు ప్రేమ కోసమే సినిమా తర్వాత రామ్ త‌న హెయిర్ స్టైల్‌ని విభిన్నంగా మార్చుకున్నాడు. అయితే అది పూరి సినిమా కోస‌మే అన్నారు. నిజంగా ఇప్పుడదే ఫిక్స్ అయ్యింది. ఈ సినిమాలో న‌టించే న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల వివ‌రాలు త్వ‌ర‌లో ప్ర‌క‌టిస్తారని సమాచారం.

Tags:    

Similar News