శిష్యుడి సినిమాకి గురువుగారి జాగ్రత్తలు!!

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకుడు గా మెగా ఫ్యామిలీ హీరో అయిన వైష్ణవ తేజ్ ని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు. వైష్ణవ [more]

Update: 2020-05-25 04:01 GMT

సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా దర్శకుడు గా మెగా ఫ్యామిలీ హీరో అయిన వైష్ణవ తేజ్ ని వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు. వైష్ణవ తేజ్ హీరోగా బుచ్చి బాబు సానా ఉప్పెన సినిమాని మీడియం బడ్జెట్ తో తెరకేక్కిన్చాడు. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉండగా…. పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ కూడా అయ్యింది. అన్నిటికి కరోనా అడ్డంకి లా ఉప్పెన కి కూడా కరోనా అడ్డం పడింది. అయితే ఇప్పుడు ఓటిటి ప్లాట్ ఫార్మ్స్ అన్ని థియేటర్స్ లో దిగకుండా కరోనా లాక్ డౌన్ తో గగ్గోలు పెడుతున్న కొత్త మీడియం సినిమాలకు వల వేసినట్టుగా ఉప్పెన సినిమాకి కూడా వల వేసి.. 14 కోట్ల ఆఫర్ ని నిర్మాతలకు ఇవ్వగా..మైత్రి మూవీస్ వారు టెంప్ట్ అవ్వకుండా మాకొద్దు మీ భారీ ఆఫర్ మా సినిమా థియేటర్స్ లోనే దింపుతామన్నారు.

ఇక తాజాగా సుకుమార్ ఆధ్వర్యంలో ఉప్పెన ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ అయ్యిందట. ఈ సినిమాకి అవసరమైన కట్స్ చెబుతూ… సినిమాని దాదాపుగా 2:30 నిమిషాలకు తగ్గించారని వినికిడి. ఇప్పటికే మూవీ అవుట్ ఫుట్ పై సుకుమార్ సంతృప్తిని వ్యక్తం చేసాడని టాక్ ఉంది.  ఈ సినిమా సూపర్ హిట్ గ్యారెంటీ అని సుకుమార్ సన్నిహితుల వద్ద చెబుతున్నాడట. మరి విజయ్ సేతుపతి విలన్ రోల్ కనిపించబోతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ఇచ్చిన మ్యూజిక్ బాగా హైలెట్ అవడంతో సినిమాపై ట్రేడ్ లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి.

Tags:    

Similar News