భారతీయుడు-2కి బ్రేక్ పడిందా..?

శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో భారతీయుడు సీక్వెల్‌ రూపొందనుందని తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. [more]

Update: 2019-02-01 08:52 GMT

శంకర్ – కమల్ హాసన్ కాంబినేషన్ లో భారతీయుడు సీక్వెల్‌ రూపొందనుందని తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసింది. ఇక జనవరి 18న రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు సినిమా షూటింగ్ జరగట్లేదని తెలుస్తుంది. కారణం సినిమాకు సంబంధించి సెట్ వర్క్ ఇంకా పూర్తి అవ్వలేదట. సెట్ వర్క్ పూర్తి అవ్వగానే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.

వెన్నెల కిషోర్ కి ఛాన్స్…

ఇదిలా ఉంటే ఈ సినిమాలో తెలుగు కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా ఓ కామిక్ పాత్రను చేయనున్నాడు. కమల్ సరసన కాజల్ నటిస్తుంది. తమిళ హీరో శింబు, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. త్వరలోనే మిగిలిన డీటెయిల్స్ తెలియనున్నాయి.

Tags:    

Similar News