ఆగస్టు 3న బ్రాండ్ బాబు

Update: 2018-07-23 13:09 GMT

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత పున్నోడా నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం బ్రాండ్‌బాబు. మారుతి సమర్పణలో శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రభాకర్‌.పి దర్శకత్వంలో ఎస్‌.శైలేంద్రబాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ అయ్యి క్లీన్ యూ సర్టిఫికేట్ పొందింది.. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియో, టీజర్ కి మంచి స్పందన రాగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 30 న గ్రాండ్ గా నిర్వహించబోతున్నారు. ఆగస్ట్ 3 న ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ అవుతుండగా ప్రభాకర్ దర్శకత్వం వహిస్తున్న రెండవ చిత్రం కావడం తో సినిమాపై మంచి అంచనాలున్నాయి..

నటీనటులు

సుమంత్‌ శైలేంద్ర, ఈషా రెబ్బా, పూజిత వన్నోడ , మురళిశర్మ, రాజారవీంద్ర, సత్యం రాజేష్‌ తదితరులు

Similar News