ఆకట్టుకుంటున్న ‘బ్రాండ్ బాబు’ ఫస్ట్ లుక్

Update: 2018-07-09 06:25 GMT

బ్రాండ్ బాబు టైటిల్ పోస్టర్, ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. డైరెక్టర్ మారుతి ఈ సినిమాకు కథ అందించడంతో పాటు సమర్పిస్తున్నారు. సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. పి.ప్రభాకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నటుడు మురళి శర్మ ముఖ్య పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాలో పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, పి.సాయికుమార్ నటిస్తున్నారు.

త్వరలో టీజర్ విడుదల

ఈ చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. త్వరలో టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారు. జీవన్ బాబు(జే.బి) ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా కార్తీక్ ఫలని సినిమాటోగ్రఫి అందిస్తున్నారు. శ్రీ శైలేంద్ర ప్రొడక్షన్ బ్యానర్ పై ఎస్. శైలేంద్ర ఈ చిత్రాన్ని నిర్మింస్తున్నారు.

నటీనటులు:

సుమంత్ శైలేంద్ర, ఇషా రెబ్బ, మురళి శర్మ, పూజిత పొన్నాడ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్, వేణు వై, నలీన్, పి. సాయి కుమార్, కోటేష్ మన్నవ, కిరణ్.

Similar News