బ్రహ్మీ నవ్వుకు ఇక ఫుల్ స్టాపేనా

ఎప్పుడు సినిమాలో అందరిని నవ్వించే హాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి ఈ మధ్యన ఆ నవ్వే కరువైపోయింది. సినిమాల్లో అవకాశాలు తగ్గడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి విషయాలతో [more]

Update: 2019-09-20 06:19 GMT

ఎప్పుడు సినిమాలో అందరిని నవ్వించే హాస్య బ్రహ్మ బ్రహ్మానందానికి ఈ మధ్యన ఆ నవ్వే కరువైపోయింది. సినిమాల్లో అవకాశాలు తగ్గడం, ఆరోగ్యం సరిగా లేకపోవడం వంటి విషయాలతో బ్రహ్మి బయట కనిపించడం తగ్గించేశాడు. కానీ చానళ్లకు వాల్మీకి లో బ్రహ్మి ఓ మంచి పాత్ర చేసాడనే విషయం ఈమధ్యనే బయటికొచ్చింది. అంతేనా మొన్న జరిగిన వాల్మీకి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం స్పెషల్ గా కనిపించాడు. ఆహ్లాదంగా నవ్వుతూ ఆనందం గా కనిపించాడు. అయితే కొత్త నీరొస్తే… పాత నీరు బయటికి పోవాలన్నట్టుగా…. కొత్త కమెడియన్స్ రాకతో బ్రహ్మి హవా టాలీవుడ్ లో పూర్తిగా పడిపోయింది.

కామెడి తగ్గిందా……

చాలా సినిమాల్లో హీరోతో సమానమైన కమెడియన్ పాత్రలు చేసిన బ్రహ్మి కి ఈ మధ్యన చిన్న రోల్స్ కూడా రావడం లేదు. బ్రహ్మిలో కామెడీ పస తగ్గడంతోనే దర్శకనిర్మాతలు బ్రహ్మానందాన్ని పక్కన పెట్టేశారు. తాజాగా బ్రహ్మికి వచ్చిన వాల్మీకి ఆఫర్ తో ఆయనకు మరిన్ని ఆఫర్స్ వస్తాయో.. లేదో అనేది వాల్మీకి లో బ్రహ్మి కామెడీ మీద ఆధారపడడమే కాదు.. సినిమా హిట్ మీద కూడా ఆధారపడివుంటుంది. మరి ఈ రోజు విడుదల కాబోతున్న వాల్మీకి పైనే బ్రహ్మి భవిష్యత్తు ఆధారపడి ఉందన్నమాట.

 

Tags:    

Similar News