బ్ర‌హ్మానందం ఎందుకు ఆలా చేస్తున్నాడు..!

Update: 2018-09-06 06:59 GMT

తండ్రులకి ఆస్తి అంటే అది వారి కుమారులే. టాలీవుడ్ లో తమ కొడుకులని ప్రమోట్ చేసుకోవటం విషయంలో బెల్లంకొండ సురేష్..ఎమ్మెస్ రాజుల రూటే సెపరేట్. తమ కొడుకుల భవిష్యత్ కోసం వీరు చాలా ఇబ్బందులు పడి మరీ ప్రమోట్ చేసుకున్నారు. కానీ బ్రహ్మానందం తన కొడుకు విషయంలో అలాంటిది ఏమి చేయట్లేదు. బ్రహ్మి కొడుకు రాజా గౌత‌మ్ లీడ్ రోల్ లో ఈనెల 7న ప్రేక్షకుల ముందుకు 'మను' అనే సినిమా వస్తుంది.

గతంలో బాగానే కష్టపడ్డా..

ప్రేక్షక ఆదరణ ఉన్న ఈ సినిమాకు మార్కెట్ లో మంచి బ‌జ్ ఉంది. షార్ట్ ఫిలిం మేకర్ ఫణింద్ర నర్సెట్టి దర్శకత్వం చేసిన ఈ సినిమా ప్ర‌మోష‌న్లు ఓ మాదిరిగా సాగుతున్నా.. ఎక్క‌డో చిన్న అసంతృప్తి. ఈ సినిమా ప్రొమోషన్స్ లో బ్రహ్మి కూడా ఓ చేయి వేస్తే బాగుండేది క‌దా? అని. గతంలో రాజా గౌత‌మ్ 'బ‌సంతి' విష‌యంలో బ్రహ్మి చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడు. ప్రొమోషన్స్ విషయంలో కూడా దగ్గరుండి మరీ చేశాడు. అందుకే ఆ సినిమాను బయర్స్ కొన్నారు.

హిట్ అయితేనే ప్రమోట్ చేస్తా..!

అదే విధంగా 'మ‌ను' విష‌యంలోనూ జ‌రుగుతుంద‌నుకున్నారు. కానీ బ్ర‌హ్మానందం నుంచి అలికిడి లేదు. అసలే తనకు సినిమా అవకాశాలు లేక టీవీ షోస్ చేస్తున్నాడు. ఆలాంటి బ్రహ్మి వచ్చి తన కొడుకు సినిమా ప్రమోట్ చేసుకుంటే ఆ ప్రొమోషన్స్ కి విలువ ఉండదని భావించాడేమో? కానీ సినిమా హిట్ అయితే వచ్చి ప్రమోట్ చేస్తానని మాట ఇచ్చాడంట బ్రహ్మి. కొడుకు కెరీర్ విషయంలో కూడా ఇటువంటివి చూసుకుంటే ఎలా బ్రహ్మి..?

Similar News