హరీష్ శంకర్ డేరింగ్ స్టెప్!

వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ వాల్మీకి ఈనెల 20 న రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హరీష్ శంకర్ [more]

Update: 2019-09-05 08:08 GMT

వరుణ్ తేజ్ – హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ ఎంటర్టైనర్ వాల్మీకి ఈనెల 20 న రావడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. హరీష్ శంకర్ అన్ని విధాలుగా ఆకట్టుకునే విధంగా ఈసినిమాలో ఇప్పటికే మాస్ కోసం ఐటమ్ సాంగ్ లాంటి స్పెషల్ ఎఫెక్ట్స్ సెట్ చేసిన హరీష్ లేటెస్ట్ గా కామెడీ ప్రేక్షకుల కోసం కామెడీ ట్రాక్ సెట్ చేసే పనిలో ఉన్నాడు.కామెడీ ట్రాక్ కోసం కమెడియన్ బ్రహ్మానందాన్ని సినిమాలోకి తీసుకున్నారు. కావాలనే హరీష్ బ్రహ్మి ని తీసుకున్నారు అని అర్ధం అవుతుంది.

ఆయన కోసం ప్రత్యేకంగా…..

చివరి నిమిషంలో ఆయనను తీసుకుని ఆయన కోసం ప్రేత్యేకంగా కామెడీ ట్రాక్ రాసుకుని షూటింగ్ జరుపుతున్నారట. సినిమాలో కామెడీ మిస్ అవుతుందని ఈ నిర్ణయం తీసుకున్నాడు హరీష్.మరి సినిమాకి ఇది ఎంత వరకు ప్లస్ అవుతుందో వేచిచూడాలి. ఏమాత్రం తేడా కొట్టినా సినిమా మీద ఎఫెక్ట్ పడుతుంది. చాలా గ్యాప్ తరువాత బ్రహ్మానందం తెరపై కనిపించనున్నారు. మరి మునుపటిలా నవ్విస్తారేమో చూడాలి. ఈసినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే నటిస్తుంది.

Tags:    

Similar News