బోయపాటి – బాలయ్య సినిమా ఆగిపోలేదు..!

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రూలర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. నిజానికి [more]

Update: 2019-05-14 07:32 GMT

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి రూలర్ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు మేకర్స్. నిజానికి బాలయ్య ఈ సినిమా కన్నా ముందు బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సి ఉంది. హెవీ బడ్జెట్ అవ్వడంతో ఆ సినిమా ఆగిపోయిందని టాక్ గట్టిగా నడిచింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఆగలేదట. ఈ సినిమాకి బోయపాటి ఇచ్చిన బడ్జెట్ దాదాపు 60 కోట్లు. బడ్జెట్ ఎక్కువ అవ్వడంతో బాలయ్య బోయపాటిని ఈ కథ పక్కన పెట్టి వేరే కథను 40 కోట్లు బడ్జెట్ లోపు రెడీ చేసి తీసుకుని రమ్మని చెప్పాడు.

క‌థ మార్చిన బోయ‌పాటి

బాలయ్య సూచన మేరకు బోయపాటి కథ మార్చకుండా కథలో మార్పులు చేసి మొత్తానికి ‘బాలయ్య’ చెప్పినట్లే బడ్జెట్ తగ్గే విధంగా స్క్రిప్ట్ లో మార్పులు చేశాడు. స్క్రిప్ట్ లో చేసిన మార్పులు బాలయ్యకు కూడా నచ్చడంతో ఓకే చేసినట్టు సమాచారం. స్క్రిప్ట్ పరంగా ఇందులో బాలయ్య రెండు పాత్రల్లో కనిపిస్తారని.. అందులో ఒక పాత్ర కొంత వైవిధ్యంగా ఉంటుందని సమాచారం. రవికుమార్ సినిమా త్వరగా కంప్లీట్ చేసుకుని బాలయ్య వెంటనే బోయపాటి సినిమాను అక్టోబర్ లో సెట్స్ మీదకు తీసుకుని వెళ్లాలని డిసైడ్ అయ్యాడట. త్వరలోనే దీని అధికారిక ప్రకటన రానుంది.

Tags:    

Similar News