బోయపాటి ఈ హీరోయిన్ ని వదలడా?

Update: 2018-05-10 09:03 GMT

ఈమధ్యన బోయపాటి సినిమాల్లో ఒక హీరోయిన్ ఏదో ఒక కేరెక్టర్ లో అయినా.. లేదా ఒక ఐటెం సాంగ్ లో అయినా కనబడుతుంది. ఆ హీరోయిన్ సరైనోడు సినిమాలో యంగ్ ఎమ్యెల్యేగా, నేనే రాజు నేనే మంత్రితో న్యూస్ ఛానల్ ఎండి కమ్ రీడర్ గా రానా ని ప్రేమలో పడేసే కేరెక్టర్ లో నటించి మెప్పించిన కేథరిన్ థెరిస్సా. బోయపాటి సరైనోడు సినిమాలో కేథరిన్ కి సెకండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. అయినా కేథరిన్ యంగ్ ఎమ్యెల్యేగా గ్లామర్ డాల్ లా ఇరగదీసింది. అలాగే బోయపాటి మళ్ళీ కేథరిన్ కి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో ఐటెం సాంగ్ లో అవకాశమిచ్చాడు. ఇక ఆ సినిమాల ఆ ఐటెం లో కేథరిన్ అందాలకు అందరూ షాకైపోయారు.

అయితే తాజాగా బోయపాటి శ్రీను కేథరిన్ కి తాను చేస్తున్న చరణ్ సినిమాలో కూడా ఐటెం లో చిందులు వేసే అవకాశం ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. జయ జనాకి నాయక లో చేసిన ఐటెం కి మాస్ ఆడియన్స్ పడిపోయారు,. అందుకే చెర్రీ తో తాను చెయ్యబోయే సినిమా కోసం బోయపాటి మళ్ళీ కేథరిన్ కి ఈ అవకాశం ఇచ్చాడట. ఇక బోయపాటి - చరణ్ సినిమా కోసం ఐటెం లో ఆడిపాడేందుకు కేథరిన్ ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకుంటుంది. మరి చరణ్ పక్కన మాస్ స్టెప్స్ వేయాలంటే అమ్మడుకున్న ప్రస్తుతం డాన్స్ ప్రాక్టీస్ సరిపోదు.

ఇక బోయపాటి - చరణ్ సినిమా బ్యాంకాక్ షెడ్యూల్ తర్వాత కేథరిన్ ఐటెం సాంగ్ చిత్రీకరణ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి చరణ్ పక్కన మాస్ స్టెప్స్ కోసం కేథరిన్ ప్రస్తుతం సిద్ధంగా ఉన్నట్టుగా సమాచారం. ఇక కేథరీన్ ఇలా ఐటమ్స్ చేసుకుంటూనే కాలం గడిపెయ్యాలేమో.. ఎందుకంటే.. కేథరిన్ కి సెకండ్ హీరోయిన్స్ ఛాన్సులు కూడా ప్రస్తుతానికి లేవు. ఇక ఇలా ఐటమ్స్ తో అలా కాలం వెళ్లబుచ్చాల్సిందే అంటున్నారు సినీప్రియులు.

Similar News