బోయపాటికి ఆమెపై అంత ఇంట్రెస్ట్ ఏమిటో..?

Update: 2018-11-28 07:10 GMT

బోయపాటి సినిమాల్లో హీరోయిన్ క్యాథరిన్ ఉండాల్సిందే అనుకుంట. తను చేసే ప్రతి సినిమాలో ఆమె ఉండేలా చూసుకుంటున్నాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. 'సరైనోడు' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఈమెకు ఛాన్స్ ఇచ్చిన బోయపాటి అప్పటి నుండి వీరిద్దరూ సినీ ప్రయాణాన్ని జాయింట్ గా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ సినిమా తరువాత బోయపాటి మరోసారి ఆమెను తన నెక్స్ట్ మూవీ లోనూ రిపీట్ చేశారు.

మళ్లీ తీసుకుందామని...

బెల్లంకొండ శ్రీనివాస్ తో బోయపాటి చేసిన 'జయ జానకి నాయక' సినిమాలో కూడా ఆమెకు ఛాన్స్ ఇచ్చాడు. అయితే ఈసారి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వేలేదు. ఐటెం సాంగ్ లో క్యాథరీన్ ను చూపించుకోగలిగాడు. మళ్లీ ఇప్పుడు బోయపాటి రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాలో కూడా ఆమెనే తీసుకుందాం అని డిసైడ్ అయ్యాడు. మరోసారి ఆమెను ఐటెం సాంగ్ లో రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడు. ఐటెం సాంగ్ లో క్యాథరీన్ మెరిసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.

ఇలియానా ఎక్కువ అడగడంతో...

మరి బోయపాటి ఆమెను తన ప్రతి సినిమాలో తీసుకోవడంలో ఎందుకు అంత ఇంట్రెస్టో..? మొదట ఐటెం సాంగ్ కోసం ఇలియానాను అనుకున్నారు కానీ ఆమె ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడంతో ఆమె ప్లేస్ లో క్యాథరిన్ ను తీసుకున్నారు. రకుల్, కాజల్ పేర్లు వినిపించినా బోయపాటికి క్యాథరిన్ అయితే బాగుంటుందని పట్టుబట్టాడట. ఆలా ఆమెకు రెండోసారి ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ వచ్చింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవ్వబోతుంది.

Similar News