బోయపాటి మామూలోడు కాదు!!

Update: 2018-04-19 08:00 GMT

రంగస్థలం సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న రామ్ చరణ్..తన నెక్స్ట్ బోయపాటి మూవీ కోసం రెడీ అయిపోయాడు. చరణ్ ఈ సినిమా షూటింగ్ లో త్వరలోనే అటెండ్ కానున్నాడు. అంత బాగానే ఉంది కానీ.. చరణ్ లేకుండా బోయపాటి రెండు షెడ్యూల్స్ ఎలా కంప్లీట్ చేసాడని అందరికీ అంతు చిక్కని విషయం.

చరణ్ లేకుండానే.....

రెండు నెలలు కిందే బోయపాటి షూటింగ్ స్టార్ట్ చేసి చరణ్ లేకుండా ఇతర నటీనటులతో షూటింగ్ కంప్లీట్ చేసాడు.చరణ్ లేకుండా ఇంత షూటింగ్ ఎలా కంప్లీట్ చేసారు అనుకుంటున్నారా..అవతలి వైపు క్యారెక్టర్ పక్కనే లేకుండా చరణ్‌ తో మాట్లాడాల్సిన సీన్లు కొన్నుంటాయ్. వాటిని ముందుగా షూట్ చేసి ఆ తర్వాత చరణ్ తో ఇటు వైపు నుంచి సన్నివేశాలను షూట్ చేస్తారన్న మాట. ఇంత తొందరగా చరణ్ లేకుండా బోయపాటి తీసాడంటే అతని సినిమాపై ఎంత క్లారిటీ ఉందో అర్ధమవుతుంది. దాదాపుగా అందరు సంవత్సరాలబడి సినిమాలు తీస్తుంటే బోయపాటి లాంటి స్టార్ డైరెక్టర్ సినిమాను త్వరగా కంప్లీట్ చేస్తుండటం మాములు విషయం కాదు.

Similar News