బోయపాటి కొత్తగా ఏమి తీస్తాడు..?

Update: 2018-11-10 06:26 GMT

ఒకే తరహా కథలతో సినిమాలు తీయడం మన డైరెక్టర్స్ కి కొత్త ఏమి కాదు. గత కొనేళ్ల నుండి ఈ తంతు జరుగుతూనే ఉంది. బోయపాటి ఇందులో ముందుంటాడు. సైలెంట్ గా ఉండే కొడుకు సడన్ గా వయలెంట్ అయిపోటం పాయింట్ తో బోయపాటి రెండు మూడు సినిమాలు తీసాడు. కాకపోతే స్క్రీన్ ప్లే వేరు అవ్వవచ్చు కానీ కథ మాత్రం ఒకటే. ఇది బోయపాటి స్టైల్. వేరే డైరెక్టర్ ది వేరే స్టైల్. ఆర్మీ నుండి వచ్చిన కొడుకు సడన్ గా ఓ ప్రాబ్లెమ్ కోసం వయలెంట్ గా మారితే అది అల్లు అర్జున్ 'సరైనోడు' సినిమా. కాలేజీ లో తన ప్రేమించిన అమ్మాయి కోసం వయలెంట్ గా మారితే 'జయ జానకి నాయకా' సినిమా.

ఒకే తరహా కథలైనా...

ఇప్పుడు రామ్ చరణ్ తో బోయపాటి తీసే సినిమా కూడా అటువంటిదే అంటున్నారు. ఇది అన్నదమ్ముల కథ అని ముందు నుండి ప్రచారం జరుగుతుంది. 'జయ జానకీ నాయక' కథ చూస్తే.. ఒక తండ్రి.. ఇద్దరు కొడుకులు.. అందులో చిన్న కొడుకు కథే సినిమా. ఇందులో కూడా ఓ తండ్రికి ఇద్దరు కోడుకులు... అందులో చిన్నోడే చరణ్. పైన చెప్పిన రెండు సినిమాల్లో సేమ్ పాయింట్.. చిన్న కొడుకు వయలెంట్ గా మారితే కథ ఏంటి అనేదే ఇందులో కూడా ఉంటుందంట. అయితే చరణ్ వాళ్ల అన్నాయ్య కోసం ఏం చేశాడు అన్నదే మిగిలిన సినిమా.

సీన్లు పండితే చాలు...

బోయపాటి సినిమాల్లో క్లాస్ కు నచ్చేలా అక్కడక్కడా కొన్ని ఎమోషనల్ సీన్స్... మాస్ ను అట్రాక్ట్ చేసే ఫైట్స్, డైలాగ్స్ ఉంటాయి. కానీ సినిమాలో రెండు మూడు చోట్ల వెంట్రుకలు నిక్కపొడుచుకునే సీన్స్ తీయడం బోయపాటి స్పెషాలిటీ. అయితే ఈ సినిమాలో కూడా అటువంటి సీన్స్ ఉంటే సినిమా 100 కోట్లు కలెక్ట్ చేయడంలో ఎటువంటి సందేహం లేదు. పైగా రామ్ చరణ్ మాస్ ఫాలోయింగ్ ఉంది. టీజర్ బట్టి చూస్తూనే ఇది ఎలాగో మాస్ సినిమా అని అర్ధం అయిపోతుంది. కాబట్టి ఇది పెద్ద విషయం ఏమి కాదు.

Similar News