బాలయ్య మార్కెట్ పెంచటానికి బోయపాటి మాస్టర్ ప్లాన్

రూలర్ సినిమాతో బాలకృష్ణ అన్ని ఇన్ని కష్టాలు పడడం లేదు. ఏ సీనియర్ హీరోకి లేని టెన్షన్ బాలయ్యకుంది. గత సినిమాల ప్లాప్స్, రూలర్ సినిమాకి రొటీన్ [more]

Update: 2019-12-13 05:10 GMT

రూలర్ సినిమాతో బాలకృష్ణ అన్ని ఇన్ని కష్టాలు పడడం లేదు. ఏ సీనియర్ హీరోకి లేని టెన్షన్ బాలయ్యకుంది. గత సినిమాల ప్లాప్స్, రూలర్ సినిమాకి రొటీన్ మార్క్ పడిపోవడంతో… ఆ సినిమా కి బిజినెస్ అంతంత మాత్రంగా ఉంది. ఇలా అయితే కష్టమనుకున్న బాలయ్య తదుపరి చిత్ర దర్శకుడు బోయపాటి మాస్టర్ ప్లాన్ వేసాడు. బాలకృష్ణ తో తనెలాగూ పవర్ ఫుల్ మూవీ చెయ్యడానికి రెడీ అవుతాడు కానీ.. బాలయ్య మార్కెట్ ని ఎలా పెంచడం అని బోయపాటి అలోచించి అలోచించి.. చివరికి బాలకృష్ణ కోసం బాలీవుడ్ హీరోయిన్ తో సహా విలన్ కూడా తీసుకురావడానికి డిసైడ్ అయ్యాడనే టాక్ ఫిలింనగర్ లో వినబడుతుంది.

బాలయ్య – బోయపాటి కాంబో అంటే భారీ అంచనాలుంటాయి కానీ.. రూలర్ దెబ్బకి ఏ మేజిక్ పనిచేయదని గ్రహించిన బోయపాటి బాలీవుడ్ లో కాస్త క్రేజున్న సోనాక్షి సింహాని బాలయ్య పక్కన సెట్ చేయడానికి రెడీ అయ్యాడని, ఇక ఈ సినిమాలో పవర్ విలన్ పాత్ర కోసం సంజయ్ దత్ కోసం మంతనాలు కూడా స్టార్ట్ చేసాడని టాక్. మరి సోనాక్షి సిన్హా, సంజయ్ దత్ లు బాలయ్య సినిమా కోసం ఒప్పుకుంటే.. ఆటోమాటిక్ సినిమా మీద హైప్ రావడం ఖాయమని, అలాగే బాలీవుడ్ మార్కెట్ మీద కూడా బాలయ్య పట్టు సాధించొచ్చనే టాక్ నడుస్తుంది. ఏలాగు భారీ యాక్షన్ చిత్రాలకు బాలీవుడ్ లో బోలెడంత క్రేజ్. ఇక బోయపాటి మాస్ కే మాస్.

Tags:    

Similar News