బోయపాటి ఓ ఇంటివాడయ్యాడు

Update: 2018-04-07 07:17 GMT

డైరెక్టర్ బోయపాటి శ్రీను వరసగా సక్సెస్ సినిమాలతో మంచి జోష్ మీద ఉన్నాడు. సినిమాకు పది నుండి పదమూడు కోట్లు తీసుకునే బోయపాటి ఇంకా అద్దె ఇంట్లోనే ఉంటున్నాడు. యూసుఫ్ గూడా దగ్గరలో తనకు అచ్చి వచ్చిన అపార్టుమెంట్ లోనే ఇల్లు, ఆఫీస్ నడుపుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా అతను సొంత ఇల్లు కట్టుకుని ఓ ఇంటివారయ్యారు.

కొండాపూర్ మెయిన్ రోడ్ మీద సొంత బంగ్లా నిర్మించుకున్నారు. దాదాపు ఆరుకోట్లకు పైగా వ్యయంతో మాంచి డ్యూప్లెక్స్ ఇల్లును బోయపాటి నిర్మించుకున్నారు. అయితే సినిమాలో మాదిరిగా రిచ్ లుక్ ఉండేటట్టు ఆ డ్యూప్లెక్స్ ను కట్టుకోల. చాలా సింపుల్ డిజైన్ తో, వీలయినంత సింపుల్ గా కనిపించేలా కట్టుకున్నారు.

లేటెస్ట్ గా గృహప్రవేశం చేసుకున్న బోయపాటి అతి కొద్ది మంది సన్నిహితులను, కుటుంబసభ్యులను ఆహ్వానించారు. ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా బోయపాటి ఉన్నారు. రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్న బోయపాటి ఆ తర్వాత మహేష్ తో.. బాలయ్యతో సినిమాలు ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది.

Similar News