మహర్షిపై కన్నేసిన బాలీవుడ్ స్టార్..?

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో మహేష్ 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజ [more]

Update: 2019-05-09 11:45 GMT

మహేష్ బాబు – వంశీ పైడిపల్లి కాంబోలో మహేష్ 25వ సినిమాగా తెరకెక్కిన మహర్షి సినిమా భారీ అంచనాల నడుమ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజ హెగ్డే హీరోయిన్ గా మహేష్ బాబు త్రీ షేడ్స్ లో కనిపించిన ఈ మహర్షి సినిమాపై భారీ అంచనాలున్నాయి. అందుకే ప్రేక్షకుల కళ్ళే కాదు.. పలు ఇండస్ట్రీ హీరోల కళ్ళు కూడా ఈ మహర్షి మీద ఉన్నాయి. భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ తో బరిలోకి దిగిన మహర్షి సినిమా రీమేక్ కోసం అప్పుడే కొంత మంది పరభాషా హీరోలు ప్రయత్నాలు మొదలు పెట్టినట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మహర్షి చిత్రంపై కన్నేసినట్లు టాక్.

ముంబైలో సినిమా చూడనున్న సల్మాన్

అందులో భాగంగానే సల్మాన్ ఖాన్.. ప్రభుదేవాతో కలిసి ముంబైలో మహర్షి మూవీని వీక్షించబోతున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మహర్షి సినిమా చూసి నచ్చితే సల్మాన్ ఖాన్ మహర్షి హిందీ రీమేక్ రైట్స్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడని అంటున్నారు. కాకపోతే మహర్షి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూసుకుని సల్మాన్ రంగంలోకి దిగుతాడని చెబుతున్నారు. మరి మహర్షి హిందీ డబ్బింగ్ రైట్స్ ని భారీగా 20 కోట్లకు విక్రయించారు మహర్షి నిర్మాతలు. అయినప్పటికీ సల్మాన్ కి నచ్చితే మహర్షి రీమేక్ ఖాయమంటూ వార్తలొస్తున్నాయి. గతంలో మహేష్ పోకిరిని సల్మాన్ బాలీవుడ్ లో రీమేక్ చేసి భారీ హిట్ కొట్టాడు. అందుకే ఇప్పుడు సల్మాన్ ఖాన్ కన్ను మహర్షి మీద పడినట్లుగా చెబుతున్నారు.

Tags:    

Similar News