తెలుగులో బాలీవుడ్ భామల జోరు

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజున్న హీరోయిన్స్ ని వేళ్లమీద లెక్కపెట్టడానికి కూడా కనిపించడం లేదు. అందుకే స్టార్ హీరోలందరికీ ఏకైన ఆప్షన్ గా పూజా హెగ్డే కనబడుతుంది. [more]

Update: 2019-03-15 07:21 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజున్న హీరోయిన్స్ ని వేళ్లమీద లెక్కపెట్టడానికి కూడా కనిపించడం లేదు. అందుకే స్టార్ హీరోలందరికీ ఏకైన ఆప్షన్ గా పూజా హెగ్డే కనబడుతుంది. అందుకే జక్కన్న కూడా తన #RRR కోసం పర భాషా హీరోయిన్ ని తీసుకున్నాడు. అందులోనూ #RRR పది భాషల్లో విడుదలవుతుంది కాబట్టి బాలీవుడ్ భామ అయితేనే వర్కౌట్ అవుతుందని అలియా భట్ ని తీసుకొచ్చాడు. ఎన్టీఆర్ కోసం హాలీవుడ్ హీరోయిన్ అన్నాడు. మరామె ఎవరికీ పరిచయం కూడా లేని పేరు కాబట్టి.. అంతగా క్రేజ్ అనిపించడం లేదు. ఇప్పడు అందరి కళ్లూ అలియా భట్ మీదే ఉన్నాయి. బాలీవుడ్ లో చిన్న వయసులోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా చేతినిండా సినిమాలతో బిజీగా ఉండి కూడా రాజమౌళి అడిగాడని.. #RRR కోసం వచ్చేసింది అలియా. మరి నేషనల్ వైడ్ గా సినిమా అంటే ఆ మాత్రం క్రేజున్న హీరోయిన్ ఉండాల్సిందే. అందుకే రాజమౌళి సౌత్ హీరోయిన్స్ జోలికెళ్లలేదు.

భారీ బడ్జెట్ సినిమాలతో…

ఇక ఇప్పటికే మరో భారీ బడ్జెట్ మూవీ ద్వారా మరో బాలీవుడ్ హీరోయిన్ ఇప్పుడో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రభాస్ తో నేషనల్ వైడ్ గా తెరకెక్కుతున్న సాహో సినిమాతో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ శ్రద్ధా కపూర్ కూడా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. మరి 350 నుండి 400 కోట్ల భారీ బడ్జెట్ తో #RRR తో అలియా భట్ టాలీవుడ్ కి వస్తుంటే, 250 నుండి 300 కోట్ల బడ్జెట్ తో శ్రద్ధా కపూర్ కూడా దూసుకొచ్చింది. మరి భారీ బడ్జెట్ మూవీస్ అంటే బాలీవుడ్ హీరోయిన్స్ పక్కా అనేలా ఉంది ప్రస్తుతం టాలీవుడ్ వ్యవహారం. ఒకప్పుడు వెంకటేష్ బాలీవుడ్ హీరోయిన్స్ తో చాలాసార్లు రొమాన్స్ చేసాడు. ఇక మహేష్ బాబు కూడా బాలీవుడ్ హీరోయిన్స్ తో ఆడిపాడారు. కానీ అప్పట్లో అంతగా ఫోకస్ అవని బాలీవుడ్ భామలు ఇప్పుడు మాత్రం టాలీవుడ్ ని ఏలడానికి రెడీ అవుతున్నారు. ఇక, ఎన్టీఆర్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ పేరు పలకడానికి కూడా నందమూరి ఫాన్స్ తడబడాల్సి వచ్చేలా ఉంది ఆ హాలీవుడ్ హీరోయిన్ పేరు.

Tags:    

Similar News