పాపం జాక్విలైన్ ఫెర్నాండెజ్...

Update: 2018-06-11 07:51 GMT

హీరోయిన్ జాక్విలైన్ ఫెర్నాండెజ్ కు రేస్ 3 సినిమా ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. సల్మాన్‌ఖాన్- జాక్విలైన్ - అనిల్‌కపూర్ కాంబోలో వస్తున్నా రేస్ 3 ఈ నెల 15న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ యాక్షన్ సన్నివేశం షూట్ చేస్తున్న టైంలో జాక్విలైన్ కంటికి గాయమైంది.

షూటింగ్ సమయంలో కాదా..?

దాంతో డాక్టర్స్ ని సంప్రదించగా...గాయంవల్ల కంటిలో ఉండే ఐరిస్ రూపం కోలుపోయింది అని చెప్పారు. దీనికి ట్రీట్‌మెంట్ లేదని.. జీవితాంతం ఇలా వంకర తిరిగిన ఐరిస్‌తో ఉండాలని చెప్పారంట డాక్టర్స్. ఈ విషయాన్నీ ఆమె తన ఇంస్టాగ్రామ్ లో ఆ కంటి పిక్ ని పోస్ట్ చేసి అభిమానులతో షేర్ చేసుకుంది. ఐరిస్ ఎప్పటికీ గుండ్రంగా కనిపించదు కానీ.. చూడగలుగుతున్నా అంటే అది నాకు అదృష్టం అని రాసుకొచ్చింది. అయితే కొందరు మాత్రం ఆమెకు షూటింగ్ టైంలో గాయమవ్వలేదని... స్క్వాష్‌ ఆడుతున్నప్పుడు కంటికి గాయమైందని అంటున్నారు.

Similar News