వరుణ్ తేజ్ మూవీలో బాలీవుడ్ నటుడు..!

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలతో కనువిందు చేయనున్నాడు. మొదట హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘వాల్మీకి’ [more]

Update: 2019-03-12 07:53 GMT

టాలీవుడ్ మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలతో కనువిందు చేయనున్నాడు. మొదట హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘వాల్మీకి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసారు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా తరువాత వరుణ్ కొత్త దర్శకుడు కిరణ్ కొర్రపాటితో ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాను అల్లు అర్జున్ అన్నయ్య వెంకటేష్ నిర్మించనున్నాడు. ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అందుకు సంబంధించి వరుణ్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.

సునీల్ శెట్టిని తీసుకురావడానికి…

ఒలింపిక్స్ పతక విజేత టోనీ వద్ద వరుణ్ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బాలీవుడ్ నటుడిని తీసుకుందామని ట్రై చేస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరో కమ్ నటుడు అయిన సునీల్ శెట్టిని ఈ మూవీలో తీసుకోవాలని అనుకుంటున్నారు. గత కొంతకాలంగా చాలా అరుదుగా సినిమాలు చేస్తున్న సునీల్ శెట్టి అయితే బాగా సూట్ అవుతాడనే ఉద్దేశ్యంతో ఆ పాత్రను ఆయనతో చేయించాలని నిర్ణయించుకున్నారు. ఈ మధ్య బాలీవుడ్ స్టార్స్ మన తెలుగు సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

Tags:    

Similar News