సాహోపై బాలీవుడ్ నటుడి విమర్శలు

బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ కు అత్యంత వివాదాస్పద నటుడిగా పేరు వచ్చింది. బాలీవుడ్ లో చాలా సినిమాల విషయంలో, హీరోస్ పైన, ప్రముఖుల మీద [more]

Update: 2019-05-25 08:20 GMT

బాలీవుడ్ నటుడు కమల్ ఆర్ ఖాన్ కు అత్యంత వివాదాస్పద నటుడిగా పేరు వచ్చింది. బాలీవుడ్ లో చాలా సినిమాల విషయంలో, హీరోస్ పైన, ప్రముఖుల మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎప్పడూ వార్తలలో ఉంటాడు ఈ నటుడు. ఒక టైంలో అతని చర్యలు శృతిమించడంతో అతని సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ చేసారు. బాహుబలి రిలీజ్ తరువాత అంతా బాహుబలి మేనియాతో ఊగిపోతున్న తరుణంలో మనోడు మాత్రం బాహుబలి చిన్న పిల్లలు చూసే కార్టూన్ మూవీలా ఉందని తీవ్ర విమర్శలు చేసాడు.

సాహో డిజాస్టర్ అంట

ఇప్పుడు మరోసారి ప్రభాస్ చిత్రంపై విమర్శలు చేసాడు. రీసెంట్ గా కమల్ ఆర్ ఖాన్… ప్రభాస్ లేటెస్ట్ చిత్రం “సాహో”పై విమర్శలు చేసాడు. ఈ మూవీ కచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని అన్నారు. ఈ మూవీ టి-సిరీస్ చరిత్రలోనే ఒక పెద్ద డిజాస్టర్ అవుతుంది, ఎందుకంటే దాని బడ్జెట్ 250 కోట్లు” అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. అయితే ఇతను చేసిన ఈ వ్యాఖ్యలు మనోళ్లు పెద్దగా పట్టించుకోట్లేదు.

Tags:    

Similar News