బ్లాక్ బస్టర్ ఇచ్చారు ఖాళీ అయ్యారు!!

టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్స్ కి భారీ డిమాండ్ ఉంటుంది కానీ.. ఇప్పుడు డిమాండ్ సంగతి పక్కనబెడితే.. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన చాలామంది [more]

Update: 2020-07-09 06:57 GMT

టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ ఇచ్చిన డైరెక్టర్స్ కి భారీ డిమాండ్ ఉంటుంది కానీ.. ఇప్పుడు డిమాండ్ సంగతి పక్కనబెడితే.. బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన చాలామంది డైరెక్గ్టర్స్ ఇప్పుడు తమ నెక్స్ట్ సినిమాలు మొదలెడటానికి నానా తంటాలు పడుతున్నారు. బ్లాక్ బస్టర్ ఇచ్చాక దాదాపుగా రెండేళ్లు గ్యాప్ వచ్చిన ప్రస్తుతం సినిమాలు చేద్దామని సెట్స్ మీదకెళ్ళిన డైరెక్టర్స్ అందరికి కరోనా షాకిచ్చింది. ముఖ్యంగా భరత్ అనే నేను చేసిన కొరటాల శివకి, రంగస్థలం చేసిన సుకుమార్ కి… తాజాగా అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ ఇచ్చిన త్రివిక్రమ్ అందరూ.. ఇప్పుడు కొరటాల చిరు కోసం రెండేళ్లు టైం స్పెండ్ చేసి ఆచార్య పట్టాలెక్కింఛాక కరోనా తగులుకుంది.

ఇక సుకుమార్ అయితే రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మహేష్ ని మెప్పించలేక రెండేళ్లు ఖాళీగానే ఉండి.. చివరికి బన్నీతో సినిమా మొదలు పెడితే.. కరోనా అడ్డం పడింది. ఇక త్రివిక్రమ్ అయితే అల వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తరవాత మెరుపు వేగంగా ఎన్టీఆర్ తో సినిమా మొదలు పెట్టాడు. కానీ కరొనతో ఆ సినిమా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అలాగే సరిలేరు తో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి పరిస్థితి అదే. ఇక అర్జున్ రెడ్డి డైరెక్టర్ బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. కానీ ప్రస్తుతం నెక్స్ట్ సినిమాపై ఇంకా సందిగ్ధం. ఇక భీష్మ హిట్ తర్వాత వెంకీ కుడుములు చడీ చప్పుడు లేదు. మరి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసిన ఈ డైరెక్టర్స్ అందరికి గ్యాప్ అయితే తప్పలేదు.

Tags:    

Similar News