విజయ్ లిద్దరూ తలపెడితే

తనకి అచ్చొచ్చిన అట్లీ దర్శకత్వంలో బిగిల్ సినిమా చేస్తున్న విజయ్… ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి తన తదుపరి సినిమా షూటింగ్ కోసం సమాయత్తమవుతున్నాడు. [more]

Update: 2019-09-19 06:07 GMT

తనకి అచ్చొచ్చిన అట్లీ దర్శకత్వంలో బిగిల్ సినిమా చేస్తున్న విజయ్… ఆ సినిమా షూటింగ్ ని పూర్తి చేసి తన తదుపరి సినిమా షూటింగ్ కోసం సమాయత్తమవుతున్నాడు. బిగిల్ సినిమా దీపావళి కానుకగా విడుదలవుతుంది. బిగిల్ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఎందుకంటే విజయ్ – అట్లీ కాంబో హిట్ కనక. ఇక బిగిల్ తర్వాత విజయ్, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో నటించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన లోకేష్ కనగరాజ్ – విజయ్ సినిమా కోసం నటీనటుల ఎంపిక మొదలయ్యిందనే టాక్ ఉంది.

ఏ పాత్రకైనా ఓకే….

ఈ సినిమాలో విజయ్ సరసన నయనతార, కాజల్ ల పేర్లు హీరోయిన్స్ లిస్ట్ లో వినబడితే.. తాజాగా విలన్ పాత్రకి విజయ్ సేతుపతి పేరు వినబడుతుంది. కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేకతను పెంచుకున్న విజయ్ సేతుపతి.. ఇంపార్టెన్స్ ఉన్న ఏ పాత్రకైనా ఓకే చెబుతున్నాడు. అందులో విలన్ పాత్ర అయినా.. కేరెక్టర్ ఆర్టిస్ట్ పాత్ర అయినా సరే. తాజాగా విజయ్ సినిమా కోసం విజయ్ సేతుపతి విలన్ గా చేయబోతున్నాడని .. దానికి ఒప్పుకున్నాడని టాక్ కోలీవుడ్ లో మొదలైంది. మరి మంచి క్రేజ్ ఉన్న విజయ్ లీడరు ఒకే సినిమాలో తలపడితే… ఆ సినిమా కోసం ఫాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూడాల్సిందే.

 

 

Tags:    

Similar News