పెద్దగా కిక్ ఇవ్వలేదు!!

ఎప్పటినుండో ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులను స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 4 మొదలు పెట్టి ఉత్సాహాన్నిచ్చింది. గత రాత్రి నాగార్జున హోస్ట్ గా మొదలైన [more]

Update: 2020-09-07 03:57 GMT

ఎప్పటినుండో ఎదురు చూస్తున్న బుల్లితెర ప్రేక్షకులను స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 4 మొదలు పెట్టి ఉత్సాహాన్నిచ్చింది. గత రాత్రి నాగార్జున హోస్ట్ గా మొదలైన బిగ్ బాస్ సీజన్ 4 ఎంట్రీ ఎపిసోడ్ చాల గ్రాండ్ గా మొదలయ్యింది. 16 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ సీజన్ 4 15 ఎపిసోడ్స్ తో మొదలయింది. అయితే ఎప్పటిలాగేబిగ్ బాస్ సీజన్ 4 కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకుంటే పొరబాటే. ఎప్పటిలాగే ఈ సీజన్ లో ఉంటుంది అనుకోవడానికి ఏం కనిపించడం లేదు. అంతగా ఫేమ్ లేని కంటెస్టెంట్స్ ఈ షోకి రావడం, ఎవరూ పెద్దగా ఎంటరైనర్స్ గా కనిపించక పోవడం ఏ షో కి దెబ్బనే చెప్పాలి. నాగార్జున తన వంతుగా కంటెస్టెంట్స్ పరిచయాలు చేసిన ఎక్కడో ఏదో మిస్ అయిన ఫీలింగ్. కంటెస్టెంట్స్ లో నోయెల్, లాస్య కాస్త ఎంటెర్టైనెర్స్ గా కనిపిస్తున్నారు.

మిగతా వాళ్లలో అమ్మ రాజశేకేర్, దర్శకుడు సూర్య కిరణ్, అలాగే టివి ఆర్టిస్, దేత్తడి హారిక, టివి 9 దేవి, గంగవ్వ, కరాటే కళ్యాణి ఇలా వీళ్లంతా ఈ షోకి ఎందుకొచ్చారో తెలియట్లేదు. ఇక హీరోయిన్ మోనాల్ గజ్జర్ కూడా కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నారనిపిస్తుంది. గత సీజన్ లో ఎలా ఉందొ ఈ సీజన్ 4 కూడా అలానే ఉంది. సీజన్ త్రీ లో డాన్స్ మాస్టర్ బాబా ఉంటే.. ఈ సీజన్ లో అమ్మ రాజశేఖర్ ఉన్నాడు. ఇక టివి 9 నుండి జాఫర్ వస్తే.. ఇప్పుడు దేవి దేవివచ్చింది. అలాగే గత సీజన్ లో హేమ.. ఈ సీజన్ లో కరాటే కళ్యాణి, యూట్యూబ్ స్టార్స్ ఆశు రెడ్డి లాంటి వాళ్ళు సీజన్ త్రీ లో ఉంటే ఈ సీజన్ లో హారిక, అలాగే మరో యూట్యూబ్ స్టార్ ఉన్నారు. 

ఇక టివి ఆర్టిస్ట్ లుగా రవి, రోహిణి లు గత సీజన్ లో ఉంటె.. ఈ సీజన్ లో మరో ఇద్దరు టివి ఆర్టిస్ట్ లు ఉన్నారు. ఇక గత సీజన్ లో తెలంగాణ నుండి యాంకర్ శివ జ్యోతి వస్తే ఈ సీజన్ లో సుజాత వచ్చింది. మరి మూడో సీజన్ ఎలా ఉందొ అలానే నాలుగో సీజన్ కంటెస్టెంట్స్ ఉన్నారు. ఇక బాడీ బిల్డర్ గా గత సీజన్ లో అలీ కనబడితే.. ఈ సీజన్ లో మరో మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ వచ్చాడు. పెద్దగా మార్పేమీ లేదు. మరి ఓపెనింగ్ డే నే నీరసంగా అనిపిస్తే వీక్ డేస్ లో ఈ సీజన్ 4 వీకవ్వడం ఖాయంగానే కనబడుతుంది.

Tags:    

Similar News