ఇది కదా కావాల్సింది బాస్!!

బిగ్ బాస్ సీజన్ 4 మొదలైన కొత్తలోనే బిగ్ బాస్ బోర్ కొట్టిందన్న తెలుగు బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులు.. ఇప్పటికి అదే బోర్ ఫీలవుతున్నారు..అందుకే తాజాగా [more]

Update: 2020-11-17 13:27 GMT

బిగ్ బాస్ సీజన్ 4 మొదలైన కొత్తలోనే బిగ్ బాస్ బోర్ కొట్టిందన్న తెలుగు బిగ్ బాస్ బుల్లితెర ప్రేక్షకులు.. ఇప్పటికి అదే బోర్ ఫీలవుతున్నారు..అందుకే తాజాగా బిగ్ బాస్ గేమ్ ప్లాన్ మార్చాడు. ఇప్పటివరకు హౌస్ మేట్స్ ఎంతగా గొడవలు పడినా.. వాళ్ళు మళ్ళీ మళ్ళీ కలిసిపోయి.. బిగ్ బాస్ కి స్టఫ్ దొరక్కుండా చేసేసారు. దానితో బిగ్ బాస్ టిఆర్పి పెంచుకోవడానికి అఖిల్ – మోనాల్ – అభిజిత్ అనే ట్రయాంగిల్ లవ్ స్టోరీని ప్రేక్షకులకు అందించింది బిగ్ బాస్.. ఈమధ్యన అఖిల్ – మోనాల్ లవ్ స్టోరీ కూడా పక్క దారి పట్టింది. అప్పటి నుండి బిగ్ బాస్ మరీ డల్ అయ్యింది.

తాజాగా బిగ్ బాస్ ప్లాన్ లో కంటెస్టెంట్స్ చిక్కుకున్నారు. బిగ్ బాస్ ప్లాన్ చేసి కంటెస్టెంట్స్ నుండి తనకు కావల్సిన స్టఫ్ ని రాబట్టుకుంది. సోమవారం ఎలిమినేషన్స్ ఎపిసోడ్ లో  కంటెస్టెంట్స్ మధ్యన అగ్గి రాజేసింది. అది అలాంటి ఇలాంటి అగ్గి కాదు.. మనోభావాలు తగలడిపోయేంత మంట పుట్టించింది. అభిజిత్ ని నామినేట్ చేసిన అఖిల్ పులి మేక స్టోరీ తో అభిని రెచ్చగొట్టి వదిలాడు. ఎప్పుడూ కూల్, మిస్టర్ పర్ఫెక్ట్ గా ఉండే అభిజీత్ రెచ్చిపోయి నా సోచ్ ఎక్కడ పడిపోయిందో నువ్వు చెప్పే మొనగాడివా.. అయినా సీక్రెట్ రూమ్ లో నాలుగు రోజులుండి.. సినిమా చూసి ఇక్కడికొచ్చి రివ్యూ ఇస్తావా.. నువ్వు నా ముందు బచ్చా గాడివి అంటూ వీర లెవల్లో అఖిల్ మీద రెచ్చిపోయాడు. 

మేక లా ఉన్న నేను పులిగా మరి వచ్చాను అన్న అఖిల్ కూడా నువ్వు 30 ఏళ్ళకి ఇక్కడికి వస్తే నేను 25 ఏళ్లకే వచ్చా అంటూ అభిని రెచ్చగొడుతున్న ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి ఈ రోజు నామినేషన్స్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అసలు రూపాలు బయటికి వచ్చి.. బిగ్ బాస్ కి కావాల్సిన స్టఫ్ అందించారు. మరి ఇది కదా కావాల్సింది బాస్ అనేలా ఉంది నిన్నటి ఎపిసోడ్.

Tags:    

Similar News