బిగ్ బాస్ గేమ్ పక్కా ప్లాన్

బిగ్ బాస్ సీజన్ 3 ఏం రసవత్తరంగా సాగడం లేదు. అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ తప్పితే బిగ్ బాస్ సీజన్ 3 పక్కాగా ప్లాప్ అని చెప్పొచ్చు. [more]

Update: 2019-10-01 06:25 GMT

బిగ్ బాస్ సీజన్ 3 ఏం రసవత్తరంగా సాగడం లేదు. అక్కడక్కడా కొన్ని ఎపిసోడ్స్ తప్పితే బిగ్ బాస్ సీజన్ 3 పక్కాగా ప్లాప్ అని చెప్పొచ్చు. గత ఆదివారం నాగార్జున హౌసెమెట్స్ తో కాస్త ఎంజాయ్ చేసే గేమ్ ఆడించాడు. ఇక శ్రీముఖిని టైటిల్ విన్నర్ ని చెయ్యాలనే ఉద్దేశ్యంతో..ఆమెని కాపాడుతూ బిగ్ బాస్ నిర్వాహకులు బిగ్ బాస్ నుంచి ఫైనల్ వీక్ కి ఉండే వరకు ప్లాన్ చేస్తుంది. మరోపక్క బాబా భాస్కర్ ని బిగ్ బాస్ ప్లాన్ చేసి మరీ ఇరికిస్తుంది. రవి ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో పెద్దగా ఎమోషన్ కనబడకపోయినా.. గేమ్ మొత్తం బాబాని ఇరికించే యత్నాలైతే జరుగుతున్నాయి.

ఎలిమినేషన్లో రాహుల్…..

బాబా భాస్కర్ హౌసెమెట్స్ గురించి మాట్లాడిన కొన్ని మాటలను సీక్రెట్ గా చూపించడం, హౌసెమెట్స్ మొత్తానికి బాబాని టార్గెట్ చేసేలా ప్లాన్ చెయ్యడం, వీక్ కంటెస్టెంట్ అయిన పునర్నవిని ఇంకా హౌస్ లోనే ఉంచడం, శ్రీముఖి కెప్టెన్ అయ్యాక కొద్దిగా కుదురు రావడం, నిజంగానే హిమజ చెప్పినట్టుగా శ్రీముఖి చేసేవి చాలా విషయాలు బయటికి రాకుండా జాగ్రత్త పడడం, అలీని హౌస్లోకి తీసుకొచ్చి బాబాని టార్గెట్ చేయించడం చూస్తుంటే… ఈ వారం బాబా భాస్కర్ ని బయటికి పంపే ప్రయత్నాలు స్టార్ట్ అయినట్లే కనబడుతుంది. ఇక సోమవారం నామినేషన్ ప్రక్రియలో భాగంగా బిగ్ బాస్ పెట్టిన టాస్క్ ని హౌసెమెట్స్ కాస్త ఫన్నీగానే ఆడారు. ఇక ఈ వారం ఎలిమినేషన్ లో మొదటగా రాహుల్ ఉన్నాడు. ఇంకా ఎంతమంది ఉంటారో అనేది ఈ రోజు తెలుస్తుంది.

 

Tags:    

Similar News