భారీ మల్టీస్టారర్ చేయనున్న శంకర్

డైరెక్టర్ శంకర్ సినిమా మేకింగ్, కాస్టింగ్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాడు. శంకర్ లేటెస్ట్ గా కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. [more]

Update: 2019-05-02 08:37 GMT

డైరెక్టర్ శంకర్ సినిమా మేకింగ్, కాస్టింగ్ విషయంలో ఎక్కడా కంప్రమైజ్ కాడు. శంకర్ లేటెస్ట్ గా కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. హెవీ బడ్జెట్ అవ్వడంతో ప్రొడ్యూసర్స్ స్టార్టింగ్ లోనే చేతులెత్తేశారు. సెట్స్ మీదకు వెళ్తుందని నమ్మకం కూడా లేదు. దీంతో ఈ మూవీ ఆగిపోయిందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో శంకర్ మరో భారీ మల్టీ స్టారర్ సినిమాను లైన్లో పెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించాడనే ప్రచారం జరుగుతోంది.

ఇద్దరు హీరోలతో చర్చలు

ఈ ప్రాజెక్ట్ కోసం శంకర్ రీసెంట్ గా హీరో విజయ్, విక్రమ్ లతో సంప్రదింపులు జరిపారట. నిజానికి ఈ ప్రాజెక్ట్ ‘భారతీయుడు 2’ తరువాత సెట్స్ మీదకు వెళ్లాలి. కానీ అది ఆగిపోవడంతో శంకర్ ఈ కథను బయటికి తీశాడని కోలీవుడ్ లో చెప్పుకుంటున్నారు. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వార్తలు అయితే బయటికి వస్తున్నాయి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వస్తుందేమో చూడాలి. అసలు శంకర్ ‘భారతీయుడు 2’ ఉండగా మరో సినిమా చేయడానికి కమల్ ఒపుకున్నాడా లేదో కూడా తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News