సోషల్ డిస్టెన్స్ ఎక్కువైనా.. ఎపిసోడ్స్ తక్కువకావు!!

అసలు ఈ ఏడాది బిగ్ బాస్ రియాలిటీ షో ఉంటుందో లేదో అనుకుంటే .. స్టార్ మా ఎప్పటిలాగే బిగ్ బాస్ ఉంటుంది.. కరోనా కి అస్సలు [more]

Update: 2020-08-06 14:08 GMT

అసలు ఈ ఏడాది బిగ్ బాస్ రియాలిటీ షో ఉంటుందో లేదో అనుకుంటే .. స్టార్ మా ఎప్పటిలాగే బిగ్ బాస్ ఉంటుంది.. కరోనా కి అస్సలు భయపడము అంటూ బిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం బిగ్ హౌస్ సెట్ పూర్తి చెయ్యడం.. నాగార్జున తో ప్రోమో షూట్స్ అంటూ హడావిడి చెయ్యడం గత వారం రోజులుగా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే సోషల్ మీడియాలో బిగ్ బాస్ సెట్ వీడియో వైరల్ అవుతుంటే.. నాగార్జున బిగ్ బాస్ ప్రోమో షూట్స్ కి హాజరవడంతో.. బిగ్ బాస్ పై ఉన్న అనుమానాలు తొలిగిపోయాయి. కాకపోతే కరొనకి భయపడి ఈ ఏడాది బిగ్ బాస్ కేవలం 50 నుండి 60 రోజులకే కుదించారని కంటెస్టెంట్స్ కూడా కేవలం 10 మంది లోపే అంటూ ప్రచారం జరిగింది.

కానీ తాజా సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ సీజన్ 4 ఎప్పటిలాగే 100 రోజులు 15 ఎపిసోడ్స్ తో 15 మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తోనే ఈ నెల 30 న స్టార్ లో బుల్లితెర మీద ప్రారంభం కాబోతుంది అని.. కాకపోతే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి కరోనా టెస్ట్ చేసి.. ఓ 14 రోజుల పాటు వాళ్ళ వాళ్ళ హోమ్స్ లోనే అంటే హోమ్ క్వారంన్టైన్ లోనే ఉండేలా బిగ్ బాస్ యాజమాన్యం ప్లాన్ చేసి మరీ.. కంటెస్టెంట్స్ ని మరోమారు కరోనా టెస్ట్ లు చేశాకే బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తారట. ఇప్పటికే బిగ్ బాస్ 15 మంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ అయ్యింది అని వాళ్ళ పేర్లని బయటికి రానివ్వకుండా బిగ్ బాస్ యాజమాన్యం జాగ్రత్తలు తీసుకుంటుందట. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ మధ్యన సోషల్ డిస్టెన్స్ ఉండేలా చూస్తారని.. సోషల్ డిస్టెన్స్ ఎక్కువైనా ఎపిసోడ్స్ తక్కువ కావంటున్నారు.

Tags:    

Similar News