ఫేక్ ఎలిమినేషన్ తో గడగడలాడించిన బాస్?

బిగ్ బాస్ గత శనివారం నుండి కాస్త రసవత్తరంగా మారింది. నాగార్జున పీకిన క్లాస్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో స్వార్ధాలు, ప్రేమలు బయటపడుతున్నాయి. అయితే [more]

Update: 2020-09-21 06:16 GMT

బిగ్ బాస్ గత శనివారం నుండి కాస్త రసవత్తరంగా మారింది. నాగార్జున పీకిన క్లాస్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో స్వార్ధాలు, ప్రేమలు బయటపడుతున్నాయి. అయితే నాగార్జున ఈ వారం 2 ఎలిమినేషన్స్ అని సభ్యులకి షాకిచ్చి శనివారం కరాటే కల్యాణిని మొదటి ఎలిమినేషన్ ద్వారా హౌస్ బయటికి పంపించారు. ఇక రెండో ఎలిమినేషన్ పై నిన్న ఆదివారం సోషల్ మీడియాలో కుమార్ సాయి అని… అతను సరిగా కామెడీ చెయ్యడం లేదు.. హౌస్ సభ్యులతో కలవడం లేని కారణంగానే ప్రేక్షకులు కుమార్ సాయి కి ఓట్స్ ద్వారా బయటికి పంపేశారు.. ఈ రెండో ఎలిమినేషన్స్ కుమర్ సాయి అంటూ ప్రచారం జరగడం.. కాదు హారిక అలేఖ్యని ఫేక్ ఎలిమినేషన్ చేసి హారికాని బయటకి పంపకుండా బిగ్ బాస్ హౌస్ లోనే సీక్రెట్ రూమ్ లో పెడుతున్నారని, గత సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్ ని పెట్టినట్టుగానే ఈసారి హారికని ఒక వారం దాస్తున్నారంటూ ప్రచారం జరగగా.. నాగ్ కూడా హారికని ఎలిమినేషన్ కి దగ్గరగానే ఉంచాడు.

ముందు అభిజిత్, తర్వాత కుమార్ సాయి తర్వాత అమ్మ రాజశేకర్ తర్వాత నోయెల్ ని సేవ్ చేసిన నాగార్జున హారిక – మోనాల్ గజ్జర్ కి హౌస్ మేట్స్ ఓట్స్ ఆధారంగా ఎలిమినేట్ చేస్తామని, ఈసారి ఓటింగ్ లేదంటూ ట్విస్ట్ ఇచ్చాడు. దానితో మోనాల్ కి నాలుగు ఓట్స్ రాగా హారిక కి మూడు ఓట్స్ రావడంతో హారికని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా నాగ్ ప్రకటించడం హారిక సూట్కేస్ సర్దుకుని బయటికి రావాల్సిందిగా నాగ్ ఆదేశించడంతో.. బిగ్ బాస్ సభ్యులంతా కంటతడి పెట్టుకున్నారు. హారిక అందరికి వీడ్కోలు చెబుతూ గేట్ దగ్గరకు రాగా.. నాగ్ అక్కడ మరో ట్విస్ట్ ఇచ్చి హారికతో సహా అందరిని లివింగ్ రూమ్ లోకి రమ్మని చెప్పి హారికని ఎలిమినేట్ చెయ్యడం లేదు.. మీరు అంతా బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియని సీరియస్ గా తీసుకోండి.. నామినేషన్స్ లోకి వెళితే ఎలా ఉంటుందో చూపిద్దామని నా ప్లాన్ ఇది అంటూ హౌస్ మేట్స్ కి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఇచ్చాడు.

Tags:    

Similar News