అబ్బో భీబత్సం

బిగ్ బాస్ మూడు సీజన్స్ లో విన్నరయిన వారిలో.. శివ బాలాజీ…. ఏదో సినిమాల్లో వచ్చిన కేరెక్టర్ చేసుకుంటున్నాడు. అంతేగాని.. బిగ్ బాస్ విన్నర్ గా శివ [more]

Update: 2020-02-08 06:22 GMT

బిగ్ బాస్ మూడు సీజన్స్ లో విన్నరయిన వారిలో.. శివ బాలాజీ…. ఏదో సినిమాల్లో వచ్చిన కేరెక్టర్ చేసుకుంటున్నాడు. అంతేగాని.. బిగ్ బాస్ విన్నర్ గా శివ బాలాజీకి ఒరిగింది ఏం లేదు. శివ బాలాజీ బిగ్ బాస్ కి వెళ్ళకముందు ఎలా వుండేవాడో.. వెళ్ళాక విన్నర్ అయ్యాక అలానే ఉన్నాడు. పెద్దగా మార్పేమీ లేదు. ఇక సీజన్ 2 విన్నర్ కౌశల్ అయితే.. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక అది పొడిచేస్తా.. ఇది పొడిచేస్తా అన్నాడు. అలాగే హీరో ఆఫర్స్ అంటూ హడావిడి చేసాడు. కౌశల్ ఆర్మీ అంటూ ఏదో అన్నాడు కానీ.. ప్రస్తుతం కౌశల్ కూడా సైలెంట్ అయ్యాడు. డైరెక్షన్, హీరో అంటూ చేసిన హడావిడి ఇప్పుడేం కనిపించడం లేదు. మొదటి రెండు సీజన్స్ విన్నర్స్ పరిస్థితి అలా ఉంటే.. ఇప్పుడు మూడో సీజన్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ పరిస్థితి దానికి పూర్తి భిన్నంగా వుంది.

అసలు విన్నర్ అవుతాడని కూడా ఎవరూ ఊహించని టైం లో రాహుల్ అనూహ్యంగా విన్నర్ అవడం, అసలు బిగ్ బాస్ విన్నరవుతుంది అనుకున్న శ్రీముఖి రన్నరప్ గా బయటికి రావడంతో. రాహుల్ సిప్లిగంజ్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. రాహుల్ బిగ్ బాస్ హౌస్ నుండి విన్నర్ గా బయట అడుగు పెట్టాడో లేదో.. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ రాహుల్ క్రేజ్ ను స్టేజ్ మీద వాడెయ్యడం, తన ఆల్బమ్స్ లో ప్లేస్ ఇవ్వడమే కాదు.. రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా కృష్ణవంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రంగమార్తాండ లో నటిస్తున్నాడు. శివాత్మిక కి జంటగా రాహుల్ నటిస్తున్నాడు. ఇక ప్రతిరోజూ సోషల్ మీడియాలో హడావిడి చేస్తున్న రాహుల్ రేంజ్ అంతకంతకు పెరుగుతూ పోతుంది. కారు, ఇల్లు ఫ్రెండ్స్ అంటూ రాహుల్ ఇప్పుడు ఏకంగా రజినీకాంత్ తో ఫోటో దిగి…తన కల నెరవేరిందిగా అంటున్నాడు.

Tags:    

Similar News