ప్లాట్ ముందే కొన్నా.. తర్వాతే బెంజ్ కారు కొన్నా అంటున్నాడు

బిగ్ బాస్ హౌస్ నుండి విన్నర్ గా బయటికొచ్చేసరికి రాహుల్ కి ఇల్లుకూడా లేదని హౌస్ లోనే చాలాసార్లు చెప్పాడు. విన్నర్ అయితేమంచి ప్లాట్ కొని తల్లితండ్రులకి [more]

Update: 2020-01-08 10:30 GMT

బిగ్ బాస్ హౌస్ నుండి విన్నర్ గా బయటికొచ్చేసరికి రాహుల్ కి ఇల్లుకూడా లేదని హౌస్ లోనే చాలాసార్లు చెప్పాడు. విన్నర్ అయితేమంచి ప్లాట్ కొని తల్లితండ్రులకి గిఫ్ట్ ఇస్తానని చెప్పేవాడు. సో బిగ్ బాస్ విన్నరయ్యాక రాహుల్ ఆ ప్రైజ్ మనీ తో సొంత ఇల్లు కొంటాడేమో అనుకున్నారు అంతా.. అయితే బిగ్ బాస్ విన్నర్ గా బయటికొచ్చిన రాహుల్ కి క్రేజ్ ఓ లెక్కలో ఉంది… సింగర్ గా కొత్త భారీబడ్జెట్ సినిమాల్లో పాటలు పడుతున్న రాహుల్ సిప్లిగంజ్ క్రేజ్ సోషల్ మీడియాలో ను ఎక్కువైంది. గత బిగ్ బాస్ విన్నర్స్ కి రాని క్రేజ్ ని మూడో సీజన్ విజేత రాహుల్ సొంతం చేసుకున్నాడు. అయితే తాజాగా రాహుల్ కెరీర్ పరుగులుపెడుతుంది.. దానికి తగ్గట్టే మనోడు డ్రెస్సింగ్ స్టైల్ అన్ని మార్చెయ్యడమే కాదు. ఓ బెంజ్ కారు కొని సోషల్ మీడియాలో ఆ కారు ఫొటోస్ తో పాటుగా నా బేబీ అంటూ ఆ కారుని అభిమనులకు పరిచయం చేసాడు.

అయితే రాహుల్ తల్లితండ్రులకి ప్లాట్ కొనిస్తా అని .. ఇల్లు కొనడం మానేసి బెంజ్ కారు కొన్నావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. గత రెండు రోజులుగా రాహుల్ కొత్త కారు కొన్నావ్… ప్లాట్ ఎందుకు కొనలేదంటూ నెటిజెన్స్ రాహుల్ ని ప్రశ్నిస్తున్నారు. అయితే రాహుల్ సిప్లిగంజ్ మాత్రం తాను ఇల్లు కొన్నాకే కారు కొన్నా అని.. అయితే కొన్న ప్లాట్ చేతికి రావడానికి 7 నెలల సమయం పడుతుంది అని.. ఈలోపు బెంజ్ కారు కొనుకున్నా అంటూ చెబుతున్నాడు. ఆల్రెడీ ఫ్లాట్ తీసేసుకున్నాను .. అది చేతికి రావడానికి ఏడు నెలలు పడుతుంది. ఈలోగా కారుకి కూడా గాలమేశాను అంటూ ట్వీట్ ఏసాడు .

Tags:    

Similar News