గతం గతః అంటున్న శత్రువులు

బిగ్ బాస్ కి వెళ్లే ముందు మంచి ఫ్రెండ్స్, బిగ్ బాస్ గొడవలతో శత్రువులుగా మారిపోయారు. ఎంతగా నాగార్జున ప్యాచప్ చేద్దామన్నా రాహుల్ – శ్రీముఖి బిగ్ [more]

Update: 2019-12-07 09:49 GMT

బిగ్ బాస్ కి వెళ్లే ముందు మంచి ఫ్రెండ్స్, బిగ్ బాస్ గొడవలతో శత్రువులుగా మారిపోయారు. ఎంతగా నాగార్జున ప్యాచప్ చేద్దామన్నా రాహుల్ – శ్రీముఖి బిగ్ బాస్ వెలుపలికి శత్రువులుగానే వచ్చారు తప్ప మిత్రులుగా కలవలేకపోయారు. శ్రీముఖి తల్లి రాహుల్ ని హౌస్ లోనే శ్రీముఖిని బాధపెట్టొద్దని చెప్పడం, శ్రీముఖి మొదటినుండి రాహుల్ ని టార్గెట్ చెయ్యడంతో. టాస్క్ ల పరంగా, వ్యక్తిత్వం పరంగా కూడా గెలవలేని రాహుల్ బిగ్ బాస్ టైటిల్ ని ఎగరేసుకెళ్లిపోయాడు. కేవలం శ్రీముఖి వల్లనే రాహుల్ కప్ గెలిచాడు అది వాస్తవం.

అయితే బయటికొచ్చాక కూడా రాహుల్ ఫోన్ చేస్తే శ్రీముఖి ఎత్తడం లేదని రాహుల్ స్వయానా మీడియా తో చెప్పడంతో ఇక వీరు కలవరనే అనుకున్నారు. కానీ తాజాగా రాహుల్ గతం గతః అంటున్నాడు. ఓ పార్టీ లో రాహుల్ శ్రీముఖి తో వేసిన డాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియో లో వరుణ్ – వితిక, పునర్నవి, రాహుల్, శ్రీముఖి లు డాన్స్ చేస్తూ తెగ ఎంజాయ్ చెయ్యడమే కాదు.. రాహుల్ – శ్రీముఖి సెల్ఫీ దిగి మరి గతం గతః అంటూ బిగ్ ట్విస్ట్ ఇవ్వడమే కాదు.. ఇప్పటినుండి ఫ్రెండ్ షిప్ స్టార్ట్ అని పెట్టిన మెస్సేజ్ చూసిన వారికీ వీరి మధ్యన గొడవలుఅన్ని గాయబ్ అంటున్నారు.

Tags:    

Similar News