చిరు వచ్చాడు..రేటింగ్ పెరిగింది

బిగ్ బాస్ సీజన్ 1 అదుర్స్, సీజన్ 2 యావరేజ్, సీజన్ 3 ఓకె ఓకె అన్నారు. నిజంగానే నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 3 [more]

Update: 2019-11-15 08:42 GMT

బిగ్ బాస్ సీజన్ 1 అదుర్స్, సీజన్ 2 యావరేజ్, సీజన్ 3 ఓకె ఓకె అన్నారు. నిజంగానే నాగార్జున హోస్ట్ చేసిన బిగ్ బాస్ 3 మొదట్లో పర్వాలేదనిపించిన .. మధ్యలో బాగా డల్ అయ్యింది. రేటింగ్ పెంచుకోవడానికి స్టార్ మా నానా తిప్పల పడింది. కానీ వర్కవుట్ అవ్వలేదు. బిగ్ బాస్ లీకులతో స్టార్ మా యాజమాన్యం తలలు పట్టుకుంది. ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్ ని ఎంతగా దాచినా.. సోషల్ మీడియా వాసన చూసి లీకులు వదలడంతో.. సీజన 3 కాస్త నెమ్మదించింది. ఇలా అయితే పనిజరగదని.. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కి మెగాస్టార్ చిరు ని అతిధిగా పిలిచారు. కానీ చిరంజీవి ఫైనల్ ఎపిసోడ్ లో లాస్ట్ వన్ అవర్ మాత్రమే గెస్ట్ గా సందడి చేసాడు.

అయితే నాగార్జున హోస్టింగ్, హాట్ హీరోయిన్స్ డాన్స్ లు, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ హడావుడితో స్టార్ మా కి సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్ లో సూపర్ టీఆర్పీ రేటింగ్ వచ్చింది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ కు 18.29 రేటింగ్ వచ్చింది. అయితే ఇది కేవలం నాగ్, హీరోయిన్స్ పెరఫార్మెన్స్ కి మాత్రమే. ఆ తర్వాత చివరి గంటలో చిరు బుల్లితెర మీద చేసిన కామెడీకి ఈ టీఆర్పీ రేటింగ్ దూసుకుపోయింది. బిగ్ బాస్ చివరి ఎపిసోడ్ చివరి గంటకు ఏకంగా 22.4 రేటింగ్ వచ్చింది.. అంటే చిరంజీవి బుల్లితెర ప్రేక్షకులను ఎంతగా మెస్మరైజ్ చేసారో ఆ ఎపిసోడ్ రోజునే మాట్లాడుకున్నాం.

చిరంజీవి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో మాట్లాడిన తీరు, ఆయన హావభావాలు, మ్యానరిజం, కామెడీ అన్ని అందరిని ఆకట్టుకున్నాయి. ముందే అనుకున్నట్టే ఈ ఫైనల్ ఎపిఓస్డ్ రేటింగ్స్ లో దూసుకుపోవడం ఖాయమని…. అనుకున్నదే నిజమైంది. బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ ఎపిసోడ్, బిగ్ బాస్ 1 ని 2 ని కూడా క్రాస్ చేసి చూపించింది. మరి మొదట్లో మందగించిన రేటింగ్.. చిఎవరిలో దుమ్ముదులిపింది.

Tags:    

Similar News