ఈరోజు ఎలిమినేట్ అయ్యేది ఈమె

బిగ్ బాస్ సీజన్ 1 టైములో ప్రతి వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో మనకు ముందే తెలిసేది కాదు. కానీ సీజన్ 2 అండ్ 3 లో [more]

Update: 2019-08-25 06:29 GMT

బిగ్ బాస్ సీజన్ 1 టైములో ప్రతి వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారో మనకు ముందే తెలిసేది కాదు. కానీ సీజన్ 2 అండ్ 3 లో అయితే మనకి రెండు మూడు రోజులు ముందే తెలిసిపోతుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షో నుండి ఈ వీక్ అషూ రెడ్డి బయటకు రానుందని సమాచారం.

నిన్న జరిగిన ఎపిసోడ్ లో మహేశ్, శివజ్యోతిలు సేవ్ అయినట్టు నాగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆపై అషూ రెడ్డి ఎలిమినేట్ అయిందని సోషల్ మీడియాలో న్యూస్ వచ్చింది. ఎందుకంటే అషూ రెడ్డి కి వోటింగ్ శాతం చాలా తక్కువ రావడంతో ఆమె ఎలిమినేట్ అయ్యే అవకాశముందని తెలుస్తుంది.

పైగా ఆదివారం జరిగే ఎపిసోడ్ ముందు రోజే చిత్రీకరిస్తుండగా, ఆడియన్స్ గా పాల్గొనే వారు ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్న సంగతిని ముందే బయటకు చెప్పేస్తున్నారు. అలా ఈ వారం అషూ రెడ్డి ఎలిమినేట్ అయిందని చెబుతున్నారు. మరి ఇది నిజమో కాదో మరి కొన్ని గంటల్లో తెలియనుంది.

Tags:    

Similar News