బిగ్‌బాస్‌ నెక్స్ట్ సీజన్ కోసం ఓకే చెబుతాడా?

బిగ్‌బాస్‌ షో మొదటి సీజన్ ను హోస్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసాడు ఎన్టీఆర్. రెండు సీజన్ కి తను అందుబాటులో లేకపోవడంతో నాని [more]

Update: 2019-01-02 07:37 GMT

బిగ్‌బాస్‌ షో మొదటి సీజన్ ను హోస్ట్ చేసి సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసాడు ఎన్టీఆర్. రెండు సీజన్ కి తను అందుబాటులో లేకపోవడంతో నాని తో కానిచ్చేశారు మేనేజిమెంట్. అయితే నాని సీజన్ 2 స్టార్టింగ్ లో కొంచం ఇబ్బంది పడ్డ తరువాత తరువాత బాగానే చేసాడు. అయిన కానీ నాని మీద వచ్చిన విమర్శలు, తనపై పెరిగిన నెగెటివిటీతో మరోసారి ఇలాంటి షోస్‌ జోలికి పోరాదని డిసైడ్‌ అయ్యాడు. ప్రతి సీజన్ కి ఒకే హోస్ట్‌ని కొనసాగించడం మాత్రం బిగ్ బాస్ వారికి కుదరడం లేదు.

మరి మూడో సీజన్ కు ఎవరిని తీసుకుంటారో అన్నది సస్పెన్స్ గా మారింది. ఎన్టీఆర్ ఈ ఏడాది మొత్తం #RRR తో బిజీ కానున్నాడు. నాని కి వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ కి యంగ్ హీరోస్ ఎవరు హోస్ట్‌ చేయడానికి సుముఖంగా లేరు. దీంతో సీనియర్లపై మాటీవీ యాజమాన్యం దృష్టి పెట్టినట్టు సమాచారం. నాగ్ ఈ షో చేసే అవకాశం లేదని పబ్లిక్ గా చెప్పడంతో వెంకీ తో చేయించాలని ట్రై చేస్తున్నారు.

సో వెంకీ ఒక్కడే ఆప్షన్. కానీ వెంకీ ఇటువంటి షో గతంలో ఎన్నడూ చేయలేదు..పైగా ఇటువంటి షోస్ చేయడానికి వెంకీ ఇష్టపడడు. హిందీలో మొదటి సీజన్ నుండి ఇప్పటివరకు అన్ని షోస్ కి సల్మాన్ దొరికినట్టు తెలుగులో కూడా ఒక నాలుగైదు సీజన్లకి అయినా ఒక్క స్టార్ సెలెబ్రెటీ దొరుకుతాడేమో అని చుస్తున్నారు బిగ్ బాస్ మేనేజిమెంట్

Tags:    

Similar News