ఎందుకింత త్యాగం…

గత ఏడాది స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 2 మొదట్లో చప్పగా… చివరిలో ఎంతో సెన్సేషనల్ అయిన విషయం తెలిసిందే. అందులో పదిహేడుమంది కంటెస్టెంట్స్ [more]

Update: 2019-01-09 06:39 GMT

గత ఏడాది స్టార్ మా లో ప్రసారమైన బిగ్ బాస్ 2 మొదట్లో చప్పగా… చివరిలో ఎంతో సెన్సేషనల్ అయిన విషయం తెలిసిందే. అందులో పదిహేడుమంది కంటెస్టెంట్స్ పాల్గొన్నారు. వారిలో పద్నాలుగుమంది సెలబ్రిటీస్ కాగా.. మిగతా ముగ్గురు కామన్ మ్యాన్స్ పాల్గొన్నారు. అయితే బిగ్ బాస్ టు లో కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన నూతన్ నాయుడు చాలా తక్కువ టైం లోనే ఎలిమినేషన్ ద్వారా బయటికెళ్లిపోయాడు. మొదట్లో కాస్త రూడ్ గా ఉన్న నూతన్ మళ్ళి రీ ఎంట్రీతో కాస్త తెలివితేటలూ ప్రదర్శించినా ప్రేక్షకులు మళ్ళీ ఇంటికి పంపేశారు. ఇక ఆ షో లో పాల్గొన్నందుకు తానేమి పారితోషకం తీసుకోలేదని… పలు ఛానల్ ఇంటర్వ్యూలో నూతన్ చెప్పాడు. అయితే అప్పట్లోనే ఫెమస్ అయ్యేందుకు నూతన బిగ్ బాస్ ని వాడుకున్నాడని అన్నారు. ఇక షో నుండి బయటికొచ్చాక నూతన నాయుడు ఎక్కడా ఫోకస్ కూడా అవ్వలేదు.

అయితే నూతన నాయుడు ఎఫ్ టు సినిమాలో ఒక స్పెషల్ రోల్ పోషించాడని న్యూస్ గత కొన్నిరోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే నూతన నాయుడు సినిమాల్లో నటించడం అనేది నిజమేనట. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక నూతన నాయుడికి మంచి మంచి అవకాశాలు సినిమా ఇండస్ట్రీ నుండి వస్తున్నాయట. అలా నూతన నాయుడు వచ్చిన అవకాశాలను వడిసి పట్టుకోవడంతో.. ఏకంగా 14 సినిమాల్లో నూతన కి ఆఫర్స్ వచ్చాయట. కేవలం సినిమాలనుండి మాత్రమేకాదు.. నూతన్ నాయుడు సీరియల్స్ లో కూడా అవకాశాలొచ్చాయట. అలా మూడు సీరియల్స్ లో నటించేందుకు నూతన నాయుడు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేశాడట.

మరి ఆ 14 సినిమాల్లో నటించినందుకు, సీరియల్స్ లో నటించినందుకు నూతన నాయుడు ఒక్క రూపాయి పారితోషకం కూడా తీసుకోవడం లేదట. పెద్ద పెద్ద సినిమాలలో అవకాశాలొచ్చినప్పటికీ…. ఎవ్వరిదగ్గర ఒక్క రూపాయి తీసుకోకుండానే నూతన ఆ సినిమాల్లో నటిస్తున్నాడట. ఆఖరుకి ఆయన మేకప్ మ్యాన్, అసిస్టెంట్ కి, ప్రయాణపు ఖర్చులు, ఎక్కడ స్టే చేసిన తన సొంత ఖర్చులతోనే నూతన్ సినిమాలకు కమిట్ అయ్యాడట. మరి ఇంతిలా పారితోషకం తీసుకోకుండా… ఆఖరుకి తన ఖర్చులు కూడా తానే పెట్టుకుని సినిమాల్లో నటిస్తూ అంత త్యాగం ఎందుకు చేస్తున్నాడు చెప్మా…. అంటూచాలామంది దీర్ఘాలు తీస్తున్నారు. మరోపక్క మనోడు ఫేమస్ అవడానికి ఇదంతా అంటూ మరో వర్గం నూతన్ గురించి చెబుతున్న మాట.

Tags:    

Similar News