కౌశల్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మందా కు హౌస్ లో ఉన్నప్పుడు ఒక క్రేజ్ ఉండేది. హౌస్ నుండి బయటకు రాగానే ఆ క్రేజ్ కొంచంకొంచం [more]

Update: 2019-08-17 07:22 GMT

బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ మందా కు హౌస్ లో ఉన్నప్పుడు ఒక క్రేజ్ ఉండేది. హౌస్ నుండి బయటకు రాగానే ఆ క్రేజ్ కొంచంకొంచం తగ్గుతూ వచ్చింది. ఇతను బిగ్ బాస్ కి రాకముందు ఒక మోడల్. అయితే బిగ్ బాస్ తో ఫుల్ ఫేమస్ అవ్వడంతో ఇతనికి ఫ్యాన్స్ ఏర్పడ్డారు. దాంతో కౌశల్ సినిమాలు చేస్తాడు అని చాలామంది అనుకున్నారు. కానీ కౌశల్ కి పెద్దగా ఆఫర్స్ రాలేదు. వచ్చినా కౌశల్ రిజెక్ట్ చేసాడు. తన భార్య నీలిమ ఆరోగ్యం మెరుగైన తర్వాతే సినిమాలు చేస్తానంటూ చెప్పాడు.

అయితే రీసెంట్ గా కౌశల్ తన ఇన్స్టా ఖాతా లో ఒక ఇంట్రెస్టింగ్ ఫోటో పెట్టాడు… “టైటిల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి .. కానీ నా మల్టి టాస్కింగ్ మాత్రం అలానే ఉంటుంది. శ్రీరాం గోల్డ్ లోన్ అడ్వర్టైజ్మెంట్ కోసం హెబ్బా పటేల్ ను డైరెక్ట్ చేస్తున్నాను” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. హెబ్బాతో కలిసి కౌశల్ ఒక స్టైలిష్ పోజు ఇచ్చాడు. గతంలో మోడల్ కానీ ఈసారి డైరెక్టర్ గా మారి ఒక యాడ్ ని రూపొందించాడు. ఈ అప్డేట్ కౌశల్ ఫ్యాన్స్ కి ఫుల్ జోష్ ఇచ్చేది.

Tags:    

Similar News