బిగ్ బాస్ విషయంలో అదే నిజామా?

బిగ్ బాస్ 1 సాలిడ్ హిట్ కాగా.. బిగ్ బాస్ 2 అనేక కాంట్రావర్సీలకు నెలవుగా మారింది. నాని హోస్టింగ్ లో బిగ్ బాస్ 2 పై [more]

Update: 2019-10-23 06:25 GMT

బిగ్ బాస్ 1 సాలిడ్ హిట్ కాగా.. బిగ్ బాస్ 2 అనేక కాంట్రావర్సీలకు నెలవుగా మారింది. నాని హోస్టింగ్ లో బిగ్ బాస్ 2 పై తెగ ట్రోలింగ్ జరిగింది. బిగ్ బాస్ 3 విషయంలో ట్రోలింగ్, కాంట్రవర్సీల సంగతెలా ఉన్నప్పటికీ బిగ్ బాస్ లీకులు మాత్రం ఎప్పటికప్పుడు స్టార్ మా కి షాకిస్తూనే ఉన్నాయి. అస్సలు క్రేజ్ లేకుండా సాగుతున్న బిగ్ బాస్ 3 ఇప్పుడు ఒక విషయంలో తెగ ట్రోల్ అవుతుంది.

విన్నర్ శ్రీముఖియేనా….?

యాంకర్ శ్రీ ముఖి విషయంలో బిగ్ బాస్ ప్రవర్తిస్తున్న తీరుని వారానికొక్కరు చొప్పున బయటికొస్తున్న కంటెస్టెంట్స్ ఎండగడుతున్నారు. బిగ్ బాస్ సీజన్ 3 కి శ్రీముఖిని ఓ పర్పస్ మీద తేవడమే కాకుండా.. ఆమెనే టైటిల్ ఫెవరెట్ గా బిగ్ బాస్ మార్చేసాడని అంటున్నారు. యాంకర్ గా బాగా ఫేమస్ అయిన శ్రీముఖి ని కేవలం క్రేజ్ కోసమే కాకుండా ఆమెతో బిగ్ బాస్ డీల్ కుదుర్చుకున్నాడని, శ్రీముఖి మీదే ఎక్కువ ఫోకస్ చెయ్యడమే కాకుండా శ్రీముఖి తో పరిచయం వున్న ఎడిటింగ్ టీం వాళ్లు కూడా శ్రీముఖిని హైలెట్ చేస్తున్నారని హిమజ, మహేష్ లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ చెప్పడంతో శ్రీముఖి బిగ్ బాస్ సీజన్ 3 టైటిల్ విన్నర్ అని ముందే జనాలు ఫిక్స్ అయ్యేలా ఉన్నారు. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా కొందరి పట్ల పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని శ్రీముఖి లాంటి కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ కావాలనే కాపాడుతున్నాడంటూ మహేష్ విట్టా చేసిన సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు శ్రీముఖి విషయంలో బిగ్ బాస్ పై అందరిలో అనుమానం గట్టిగా ఫిక్స్ అయ్యింది. ఇక రాహుల్ టైటిల్ ఫెవరెట్ గా ఉన్నప్పటికీ.. అతన్ని వరుణ్ సందేశ్ తో గొడవ పడేలా చేసి వీక్ చేస్తున్నారని.. ఫైనల్ గా శ్రీముఖిని టైటిల్ విన్నర్ గా బిగ్ బాస్ చూపించబోతున్నాడంటూ అప్పుడే సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది.

 

Tags:    

Similar News