బిగ్ బాస్ అంతా మోసం

Update: 2018-06-19 07:34 GMT

నాని వ్యాఖ్యాతగా ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్-2 సో సో గా సాగుతుంది. ఎన్టీఆర్ అంత ఆకట్టుకునేలా యాంకరింగ్ చెయ్యకపోయినా నాని కూడా పర్వాలేదనిపిస్తున్నాడు. అయితే గత వారం బిగ్ బాస్ హౌస్ నుండి కామన్ మ్యాన్ నూతన్ నాయుడు ఎలిమినేట్ అవుతాడనుకుంటే... అనూహ్యం గా సంజన ఎలిమినేటి అయ్యింది. సంజన బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి అనేక కాంట్రవర్సీలకి నెలవుగా మారింది.

ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు...

షో లోకి అడుగుపెట్టగానే బిగ్ బాస్ జైలుకెళ్లిన సంజన అక్కడనుండి తన ప్రతాపం చూపించడం మొదలు పెట్టింది. సెలబ్రిటీస్ పక్కన మేమేం తక్కువ కాదని.. నన్నేం పీకలేరని... ఇలా షార్ట్ టెంపర్ చూపించింది. ఇక ఎలిమినేషన్ తప్పించుకోవడానికి చాలా ట్రై చేసినా వర్కౌట్ అవ్వక షో నుండి బయటికి వచ్చింది. అయితే బిగ్ బాస్ హౌస్ నుండి తనని కావాలనే తప్పించారని...నందిని ని ఈ షోలోకి ఎంటర్ చేయడానికే తనని పంపేశారని ఆరోపణలు చేసింది. బిగ్ బాస్ షో అంతా కావలసినట్టు ప్లే చేసే గేమ్ అని... తనని నందిని వచ్చేవరకు వాడుకున్నారని.... ఈ షో లో పార్టిసిపేట్ చెసినందుకు ఒక్క రూపాయి కూడా బిగ్ బాస్ నిర్వాహకులు ఇవ్వలేదని సంజన వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది.

నానినీ వదలలేదు...

ఇక హీరో నాని ని కూడా సంజన వదల్లేదు. నాని యాంకరింగ్ తనకి నచ్చలేదని...ఎన్టీఆర్ బాగా చేసాడని చెప్పిన సంజన....బహుశా నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అవడం వల్లనే నాని యాంకరింగ్ తనకి నచ్చలేదేమో అంటూ బిగ్ బిన్ షో ని నిర్వహించే నిర్వాహకులని కడిగిపారేసింది.

Similar News