బిగ్ బాస్ సీజన్ 2 లో ఇదే బెస్ట్ జోక్..!

Update: 2018-09-25 07:09 GMT

బిగ్ బాస్ సీజన్ 2 స్టార్ట్ అయినప్పుడు నాని యాంకరింగ్ పై ట్రోల్స్ వచ్చేవి. ఆ తర్వాత నెమ్మదిగా అవి పోయి పర్లేదు బాగానే చేస్తున్నాడు అనే రేంజ్ కి వెళ్లాడు నాని. కానీ సోషల్ మీడియాలో నాని అంటే గిట్టని వాళ్లు ఇప్పటికీ తనని ట్రోలింగ్ చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా కౌశల్ ఆర్మీతో సోషల్ మీడియాలో ఇలా ఎక్కువగా చేస్తున్నారు. నాని ఈ మధ్య తనీష్ ని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాడని.. కౌశల్ ని టార్గెట్ చేస్తున్నాడని రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు.

ఇప్పుడు సినిమాపై కూడా...

కొన్ని వారాల నుండి నాని కౌశల్ కు బాగా కౌంటర్లు వేస్తున్నాడని.. తన తప్పులు చూపిస్తూ కౌశల్ ను డిఫెన్స్ లో పడేస్తున్నాడని.. తనని బాగా టార్గెట్ చేస్తున్నాడని.. ఇలా నానిపై మండిపడుతున్నారు. ఇప్పుడు ఇది చాలదు అన్నట్టుగా 'దేవదాస్' ని టార్గెట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది. సినిమాకు ఏ మాత్రం నెగటివ్ టాక్ వచ్చినా మేమ్స్ తో, ట్రోల్స్ తో ఎటాక్ చేసేందుకు రెడీగా ఉన్నారట. అంతేకాదు కొంతమంది సినిమాను బాయ్ కాట్ చేసే నిర్ణయం తీసుకున్నారట.

సినిమా బాగుంటే ఆపతరమా..?

ఇదంతా చూస్తుంటే చాలా జోక్ గా అనిపిస్తుంది కాదు.. నిజానికి నాని స్క్రిప్ట్ ప్రకారం ఫాలో అవుతాడని అందరికీ తెలిసిన విషయమే. లోపల మేనేజ్ మెంట్ ఏం చెప్పితే అది నాని చేస్తాడు తప్ప అతను పర్సనల్ గా ఏం చేయడు. అయినా ఇద్దరు స్టార్స్ సినిమా రిలీజ్ అవుతుంటే ఆ సినిమా ఫలితాన్ని శాసించే రేంజ్ కు సదరు ఆర్మీలు ప్రభావం చూపిస్తాయి అనడమే చాలా కామెడీగా ఉంది. కౌశల్ జస్ట్ నార్మల్ మనిషి. అతను ఏదో సంఘ సేవకుడిగా తన ఫ్యాన్స్ ట్రీట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సినిమా బాగుంటే చూస్తారు, బాగోకపోతే అసలు చూడరు అంతేకాని వంద కౌశల్ ఆర్మీలు కలిసి వచ్చినా సినిమాలో కంటెంట్ ఉంటె ఏమి చేయలేరు. సో ఇకనైనా మేలుకోండి.

Similar News