కొత్త విషయాలు చెప్పిన బిగ్ బాస్ కౌశల్..!

Update: 2018-10-05 06:25 GMT

స్టార్ మా లో 113 రోజుల పాటు జరిగిన బిగ్ బాస్ సీజన్ 2 ఇటీవలే ముగిసింది. కౌశల్ మంద విజేతగా నిలిచాడు. బిగ్ బాస్ హౌస్ లో జరిగిన కొన్ని డ్రామాల వలన, బయట కౌశల్ ఆర్మీ చేసిన హంగామాతోనే కౌశల్ కి ఈ బిగ్ బాస్ టైటిల్ దక్కింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఎవరితోనూ రిలేషన్ పెట్టుకోకుండా.. కనీసం స్నేహం చెయ్యకుండా కౌశల్ ఈ బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ని గెలిచాడని.. అందుకే కౌశల్ వ్యక్తిత్వాన్ని కౌశల్ ఆర్మీ వేయినోళ్ల పొగుడుతుంది.

సినిమాల్లో అవకాశాలు దక్కేనా..?

అలాగే సినిమా ఇండస్ట్రీ కూడా కౌశల్ కి రెడ్ కార్పెట్ పరిచినట్టుగానే కనబడుతుంది. డైరెక్టర్ మారుతి, కోన వెంకట్ వంటివాళ్లు కౌశల్ ని హౌస్ లో ఉన్నప్పుడే సపోర్ట్ చేశారు. కానీ వాళ్ల సినిమాల్లో కౌశల్ కి కేరెక్టర్ ఇస్తున్నట్టుగా ఎక్కడా చెప్పలేదు కానీ.. మాస్ డైరెక్టర్ బోయపాటి మాత్రం కౌశల్ కి తన సినిమాలో ఒక ఆఫర్ ఇచ్చినట్లుగా వార్తలు ప్రసారం అయ్యాయి. ప్రస్తుతం చరణ్ - బోయపాటి సినిమాలోనే కౌశల్ కి ఒక నెగెటివ్ రోల్ ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతుంది. గత నాలుగైదు రోజుల నుండి బిగ్ బాస్ విన్నర్ కౌశల్ బోయపాటి - చరణ్ మూవీలో నటిస్తున్నాడనే టాక్ మాములుగా స్ప్రెడ్ అవ్వలేదు. అయితే బిగ్ బాస్ షో నుండి బయటికొచ్చిన కౌషల్ ఛానల్స్ లో ఇంటర్వ్యూలు, కౌశల్ ఆర్మీతో మీటింగ్స్, ఓపెనింగ్స్ తో బిజీ బిజీ గా గడుపుతున్నాడు.

గిన్నీస్ రికార్డు కూడా...

తాజాగా చరణ్ - బోయపాటి అవకాశంపై కౌశల్ స్పందించాడు. బోయపాటి - చరణ్ సినిమాలో అవకాశం వచ్చింది. అది నిజమే... అయితే ఆ విషయం ఖరారు కాగానే నేనె మీకు స్వయంగా మీకు చెబుతాను అంటూ బోయపాటి సినిమాపై కౌషల్ స్పందించాడు. మరోపక్క తనకి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ నుండి కాల్ వచ్చిన విషయాన్ని మీడియాతో పంచుకున్నాడు. ఒక సింగిల్ కంటెస్టెంట్ కి ఇన్ని ఓట్లు రావడమనేది టీవీ చరిత్రలోనే లేదట. నాకు నిన్ననే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వారి నుండి కాల్ వచ్చింది. అయితే వారు కొంత సమయం తీసుకుని ఈ విషయాన్ని అనౌన్స్ చేస్తామని అన్నారు. గిన్నిస్ బుక్ లో చోటు దక్కనుండటం ఆనందంగా ఉంది అంటూ తన బిగ్ బాస్ విజయంపై కౌషల్ హర్షం వ్యక్తం చేశాడు.

Similar News