గేమ్ ప్లాన్ మార్చిన శ్రీముఖి

మొదట 50 రోజులు ఎలా ఉన్నా కానీ 50 రోజులు కంప్లీట్ అయిన దగ్గర నుంచి బిగ్ బాస్ సీజన్ 3 ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. గత [more]

Update: 2019-09-24 07:31 GMT

మొదట 50 రోజులు ఎలా ఉన్నా కానీ 50 రోజులు కంప్లీట్ అయిన దగ్గర నుంచి బిగ్ బాస్ సీజన్ 3 ఇంట్రెస్టింగ్ గా జరుగుతుంది. గత వారం నామినేషన్ లో రాహుల్, మహేష్, హిమజ ఉంటే అందులో రాహుల్ ని ఫేక్ ఎలిమినేషన్ చేసి హిమజ ను ఎలిమినేట్ చేసాడు బిగ్ బాస్. రాహుల్ ఎలిమినేట్ అయ్యాడు అని షాక్ లో ఉన్న ఇంటి సభ్యులకి ఒక్కసారి రాహుల్ రీఎంట్రీ ఇచ్చి షాక్ ఇచ్చాడు.

మైండ్ గేమ్…..

మొన్నటివరకు రాహుల్ ని టార్గెట్ చేసిన శ్రీముఖి ఫేక్ ఎలిమినేషన్ తో అతనికి ఫాలోయింగ్ ఉందేమో అని అర్ధం చేసుకుని బాబా భాస్కర్ అండ్ వరుణ్ సందేశ్ లను టార్గెట్ చేస్తుంది. ఈ నేపధ్యంలో సోమవారం జరిగిన నామినేషన్ ప్రాసెస్ లో వరుణ్ అండ్ రాహుల్ ఉంటె శ్రీముఖి వరుణ్ ని టార్గెట్ చేస్తూ రాహుల్ ని సేవ్ చేసింది. అలానే ఫిమేల్ కంటెస్టెంట్ అయిన శివ జ్యోతి ని టార్గెట్ చేసింది శ్రీముఖి. రోజులు దగ్గర పడేకొద్దీ ఇంట్లో ఉన్న సభ్యులు తమ తెలివితేటలు ఉపయోగించి గేమ్ ఆడుతున్నారు. ఇక రానురాను ఈ సీజన్ మరింత హీట్ గా మారనుందని అర్ధం అవుతుంది.

 

Tags:    

Similar News