బిగ్ బాస్ – 3లో ఎందరో తెలుసా..?

బిగ్ బాస్ 3 సీజ‌న్ మొద‌లైపోతోంది. జూన్, జులైలో కొత్త సెష‌న్‌కి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు మేకర్స్. హోస్ట్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ షోలో [more]

Update: 2019-04-18 10:13 GMT

బిగ్ బాస్ 3 సీజ‌న్ మొద‌లైపోతోంది. జూన్, జులైలో కొత్త సెష‌న్‌కి శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు మేకర్స్. హోస్ట్ ఎవరు అనేది ఇంకా క్లారిటీ లేదు కానీ షోలో పాల్గొనే సెల‌బ్రెటీల వేట మాత్రం మొద‌లైపోయింది. ఆల్రెడీ 20 మంది కంటెస్టెంట్స్ తో ఓ లిస్ట్ రెడీ అయిపోయింది. అందులో ఎవరు ఫైనల్ అవుతారు అనేది చూడాలి. ఈ 20 మంది లిస్ట్ లో యాంక‌ర్ల పేర్లు చాలానే ఉన్నాయ‌ని టాక్‌. ర‌ష్మి, ఉద‌య‌భాను, ఝాన్సీ, లాస్య‌ పేర్లు ప్ర‌ముఖంగా వినిపిస్తున్నాయి. మేల్ యాంకర్స్ లో ప్ర‌దీప్‌, ర‌వి ఇద్ద‌రిలో ఒక‌రు ఉండే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.

ఈసారి ఎక్కువ సెలబ్రిటీలే

ఈసారి కూడా జబర్దస్త్ నుండి ఇద్దరిని తీసుకోవాలని చూస్తున్నారు మేకర్స్. అలానే టిక్ టాక్‌ లాంటి యాప్‌ల‌తో సోష‌ల్ మీడియాలో చెల‌రేగిపోయిన వాళ్ల పేర్లు కూడా ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. సీనియర్ హీరోయిన్స్, హీరోస్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్లకి రోజువారీ పారితోషక‌మే కాకుండా, సప‌రేట్ ప్యాకేజీ ఇచ్చి షోలోకి తీసుకొద్దామ‌ని బిగ్ బాస్ టీమ్ ప్ర‌య‌త్నాలు చేస్తోంది. పోయినసారిలా కాకుండా ఈసారి సెలెబ్రెటీస్ ఎక్కువ మంది ఉండేలా ప్లాన్ చేస్తుంది టీం. త్వరలోనే ప్రైజ్ మనీ ఎంత..? హోస్ట్ ఎవరు..? కంటెస్టెంట్స్ ఎవరు..? అనేదానిపై క్లారిటీ రానుంది.

Tags:    

Similar News