బిగ్ బాస్ 3 కంటెస్టెంట్లు వీరే..!

బిగ్ బాస్ ఈ టీవీ షో మనకి కొత్త. సీజన్ 1 అప్పుడు ఎన్టీఆర్ ని హోస్ట్ గా పెట్టి క్యూరియాసిటీ పెంచి నడిపారు. మొదటి సీజన్ [more]

Update: 2019-06-15 05:41 GMT

బిగ్ బాస్ ఈ టీవీ షో మనకి కొత్త. సీజన్ 1 అప్పుడు ఎన్టీఆర్ ని హోస్ట్ గా పెట్టి క్యూరియాసిటీ పెంచి నడిపారు. మొదటి సీజన్ కి రికార్డ్‌ టీఆర్పీలు నమోదయ్యాయి. కారణం ఎన్టీఆర్ ని మొదటిసారి హోస్ట్ గా చూడడం…ఇటువంటి షోస్ మన తెలుగు లో ఎప్పుడూ చూడకపోవడం. కానీ సెకండ్ సీజన్ కి అంతగా టీఆర్పీలు రాలేదు. కారణం నాని ఎన్టీఆర్ ని మ్యాచ్ చేయలేకపోవడం. పైగా మొదటి నుండి ఈ సీజన్ వన్ సీడెడ్ గా జరగడం. అయితే ఈసారి బిగ్ బాస్ 3 లో అటువంటి తప్పులు జరగకుండా ఉండాలంటే కంటెస్టెంట్లని బాగా తెలిసిన వాళ్ళని తీసుకోవాలి డిసైడ్ అయ్యారు మేకర్స్.

రెగ్యులర్ గా టీవీ ప్రేక్షకులతో పాటు సోషల్‌ మీడియా బ్యాచ్‌ని కూడా ఆకర్షించేలా కంటెస్టెంట్లని తీసుకుంటున్నారు. ఈనేపధ్యంలో సీరియల్‌ నటుడు జాకీ, యాంకర్‌ లాస్యతో పాటు మరో ఇద్దరు యువ యాంకర్ల పేర్లు వినిపిస్తున్నాయి. యాంకర్ శ్రీముఖి పేరు కూడా విపిస్తుంది. వీరి వల్ల టీవీ సీరియల్స్‌, గేమ్‌ షోస్‌ చూసే మహిళలు బిగ్‌బాస్‌ షో చూస్తారని అంచనా వేస్తున్నారు. అలానే యూత్ ని ఎట్రాక్ట్ చేయడానికి సోషల్‌ మీడియాలో యమ పాపులర్‌ అయినా వ్యక్తులను తీసుకోనున్నారు. ముఖ్యంగా యూత్ అమ్మాయిలకు ఎంతగానో పరిచయం ఉన్న మహాతల్లి…అలానే ఈమధ్యే టిక్ టాక్ అనే అప్ ద్వారా పాపులర్ అయినా ఉప్పల్‌ బాలు కూడా ఈ సీజన్‌లో భాగమేనంటున్నారు. ఇక సింగర్ హేమచంద్రతో పాటు విప్లవాత్మక ఇంటర్వ్యూలు ఇచ్చే గాయత్రి గుప్తా కూడా లిస్టులో వుందట. దీని ద్వారా ఈసారి కచ్చితంగా సీజన్‌ రక్తి కడుతుందని భావిస్తున్నారు. పైగా నాగార్జున హోస్ట్ కావడంతో ఈసారి బిగ్‌ బాస్‌ 3 షో సక్సెస్ అయ్యేలా కనిపిస్తుంది.

Tags:    

Similar News