బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ఓవరేక్షన్

బిగ్ బాస్ 2 లో హౌసెమెట్స్ తో గొడవలు పడుతూ.. తన స్వార్ధం కోసం గేమ్ ఆడుతున్నాడని అన్నప్పటికీ… బయట సోషల్ మీడియాలో కౌశల్ కి ఓ [more]

Update: 2019-09-15 06:35 GMT

బిగ్ బాస్ 2 లో హౌసెమెట్స్ తో గొడవలు పడుతూ.. తన స్వార్ధం కోసం గేమ్ ఆడుతున్నాడని అన్నప్పటికీ… బయట సోషల్ మీడియాలో కౌశల్ కి ఓ ఆర్మీ ఏర్పడి.. కౌశల్ ని కౌశల్ ఆర్మీ విన్నర్ ని చేసింది. బిగ్ బాస్ 2 విషయంలో హోస్ట్ హీరో నాని కూడా సఫర్ అయినట్లుగా అప్పట్లో వార్తలొచ్చాయి. తాజాగా ఓ ఈవెంట్ కి హాజరైన బిగ్ బాస్ 2 విన్నర్ కౌశల్ ని ఓ ఛానల్ ప్రతినిధి మీకు బాగా నచ్చిన బిగ్ బాస్ హోస్ట్ ఎవరంటే నాని గారంటే ఇష్టం. అలాగే ఎన్టీఆర్, నాగార్జున హోస్టింగ్స్ కూడా నచ్చుతాయని చెప్పడమే కాదు.. ఖాళీ సమయాల్లో బిగ్ బాస్ 3 ని చూస్తుంటానని చెప్పాడు.

అయితే బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరూ ఇంకా ఒరిజినల్ గా కనిపించడం లేదని.. ఇంకా యాక్టింగ్ మూడ్ లోనే ఉన్నారని చెప్పిన కౌశల్ కి మీ ఫెవరెట్ కంటెస్టెంట్ ఎవరని అడగగా… ఆ ప్రశ్నని తప్పించుకునే ప్రయత్నం చెయ్యడం ఛానల్ ప్రతినిధి మాత్రం పోనీ ఓ ముగ్గురి పేర్లు చెప్పండి అంటూ పట్టుబట్టగా.. దానికి కౌశల్ పేర్లు చెప్పను.. ఎందుకంటే కౌశల్ కి బిగ్ బాస్ 3 లో ఇషమైన పేర్లు చెబితే… కౌశల్ ఆర్మీ ఫాలో అయ్యి వారినే విన్నర్ ని చేసేస్తుంది అంటూ కాస్త ఓవరేక్షన్ చేసాడు.

Tags:    

Similar News