విలన్ రోల్స్ అంటూ కోతలు కోసిన కౌశల్… చివరికి?

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మాండ.. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక తనకి గిన్నిస్ బుక్ వారు ఫోన్ చేసారని, పీఎం పేషీ నుండి [more]

Update: 2019-11-14 07:26 GMT

బిగ్ బాస్ సీజన్ 2 విజేత కౌశల్ మాండ.. బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక తనకి గిన్నిస్ బుక్ వారు ఫోన్ చేసారని, పీఎం పేషీ నుండి కాల్ వచ్చిందని ఒకటే డబ్బాలు కొట్టాడు. చివరికి అవన్నీ ఫేక్ అని తెలిసింది. ఇక దర్శకుడు మారుతీ వంటి వారు కౌశల్ ని బిగ్ బాస్ విన్నర్ అవాలని సోషల్ మీడియాలో అతనికి సపోర్ట్ చేసారు కూడా. అయితే బిగ్ బాస్ క్రేజ్ తో కౌశల్ తనకి బోయపాటి శ్రీను విలన్ ఆఫర్ ఇచ్చారని కూడా చెప్పాడు. అయితే బిగ్ బాస్ నుండి బయటికొచ్చాక తనని కౌషల్ ఆర్మీ హీరోగా చూడాలి అని అనుకుంటుదని.. తన సినిమాని కౌశల్ ఆర్మీ నిర్మిస్తుందని అన్నాడు. అయితేఏడాది గడిచిన కౌశల్ కి బోయపాటి ఛాన్స్ ఇచ్చిన దాఖలాలు లేవు. బిగ్ బాస్ క్రేజ్ తో పొడిచేద్దామనుకున్న కౌషల్ తాను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళకముందు జీ ఛానల్ లో ఓ సీరియల్ లో నటించాడు. కానీ బిగ్ బాస్ క్రేజ్ తో హీరో అవుదామని, విలనవుదామని కలలు కంటూ.. విన్నర్ అయ్యాక ఆ సీరియల్ వదిలేసాడు కౌశల్.

కానీ చివరికి హీరో కాదుకదా విలన్ అవ్వలేక.. ఏదో యాడ్ డైరెక్షన్ అంటూ చేసిన కౌశల్ మళ్ళీ జీ ఛానల్ లో ప్రసారమవుతున్న తన పాత సీరియల్ సూర్యవంశం లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక రీ ఎంట్రీ ఇచ్చాక విలన్ గా కౌశల్ క్రూరత్వం చూపిస్తున్నాడు. మరి సినిమాల్లో విలన్ గా వణికిద్దామని.. కుదరక మల్లి సీరియల్ కే వచ్చిన కౌశల్ ని చూసి అందరూ నవ్వుతున్నారు. సిసినిమాల్లో విలన్ అన్నాడు..చివరికి సీరియల్ నే నమ్ముకోవాల్సి వచ్చిందిరా అంటున్నారు

Tags:    

Similar News