బిగ్ బాస్ 2 విన్నర్ అతనేనా..?

Update: 2018-09-28 06:46 GMT

బిగ్ బాస్ సీజన్ 2 ఫైనల్ మరో మూడు రోజుల్లో జరగనుంది. ప్రస్తుతం హౌస్ లో మిగిలిన ఐదుగురులో ఒక్కరు టైటిల్ విన్నర్ అవ్వబోతున్నారు. మరి ఆ టైటిల్ విన్నర్ ఎవరో..? అన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. మొదటి సీజన్ పార్టిసిపెంట్స్ తో పోల్చుకుంటే రెండో సీజన్ పార్టిసిపెంట్స్ అంత గొప్పగా ఏమి లేరని సీజన్ స్టార్టింగ్ లో ప్రేక్షకులు కాస్త అసహనానికి లోనయ్యారు. అయితే ఉన్న పార్టిసిపెంట్స్ లో అందరి కన్నా భిన్నంగా తన తీరుతో ప్రేక్షకులను అధికంగా ఆకట్టుకుంది మాత్రం కౌశలే అని చెప్పాలి. మొదటి నుండి ఇప్పుటివరకు తన ఆటతో.. తన బిహేవియర్ తో అందరి మనసులు గెలుచుకున్న కౌశల్ టైటిల్ విన్నర్ రేస్ లో లక్షల సంఖ్యలో ఓట్లు సంపాదించుకుంటున్నారు. ఇప్పటికే కౌశల్ సభ్యుల మిగతా కన్నా ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. సుమారు 10 లక్షల ఓట్ల తేడాతో ఎత్తులో ఉన్నాడు.

ఇద్దరి మధ్య భారీ ఓట్ల తేడా..!

ఒక అన్ ఆఫీషియల్ పోలింగ్ లో కౌశల్ కు దాదపు 1.46మిలియన్ ఓట్లు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో దీప్తి ఉంది. ఆమెకు నాలుగు లక్షల ఇరవై వేల ఓట్లు వచ్చాయి. అంటే ఇద్దరికీ మధ్య వ్యత్యాసం పది లక్షలు ఉంది. దీంతో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కౌశలే అని అతని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఇప్పటి నుండే రచ్చ స్టార్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు చెప్పినవి అన్ ఆఫీషియల్ ఓట్లు. మరి ఆఫిషియల్ గా బిగ్ బాస్ షోకి ఎన్ని ఓట్లు వచ్చాయో వారికే తెలియాలి.

Similar News