నాని మెడకి తగిలించారు..!

వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న హీరో నాని… గత ఏడాది బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ [more]

Update: 2019-03-11 08:00 GMT

వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్న హీరో నాని… గత ఏడాది బిగ్ బాస్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. బిగ్ బాస్ సీజన్ 2 హోస్ట్ గా మొదట్లో ఆకట్టుకోలేకపోయినా.. తర్వాత నాని ప్రేక్షకులను బాగానే ఇంప్రెస్స్ చేసాడు. హౌస్ లోని పార్టిసిపేట్స్ ద్వారా నాని బాగా పాపులర్ అయినా తరువాత కాంటెస్టెంటెంట్స్ నుండి, బయట ప్రేక్షకుల నుండి ట్రోలింగ్ కి గురయ్యాడు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ని అదుపులో పెట్టలేక నాని చాలా సతమతమయ్యాడు. ఇక చివరికి బిగ్ బాస్ తో నానికి తల బొప్పికట్టింది. అప్పట్లో కౌషల్ ఆర్మీకి తలొగ్గి బిగ్ బాస్ యాజమాన్యం నానితో కలిసి కౌశల్ కి బిగ్ బాస్ ట్రోఫీని కట్టబెట్టారని కూడా ట్రోల్ చేసారు. ఇక హౌస్ లో కంటెస్టెంట్ అయిన బాబు గోగినేనితో నాని కాస్త ఘాటుగానే స్పందించాల్సి వచ్చింది. ఆటని ఆటలాగా ఆడండి బాబు సర్ అని సుతిమెత్తగా చెప్పాడు.

నానికి మరో తలనొప్పి…

ఇక బిగ్ బాస్ సీజన్ 2 అయిపోయి నెలలు గడుస్తున్నా.. ఆ సీజన్ 2 ఇంకా మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంది. కౌశల్ ఆర్మీతో గెలిచిన కౌశల్ ఇప్పుడు ఆ కౌశల్ ఆర్మీ ద్వారానే సమస్యలు ఎదుర్కుంటున్న విషయం తెలిసిందే. తాజాగా కౌశల్ ఆర్మీకి, కౌశల్ కి ప్రత్యక్షంగా టీవీ ఛానల్స్ సాక్షిగా యుద్ధం జరుగుతుండగా… అందులోకి బాబు గోగినేని ఎప్పటిలాగే కౌశల్ ని విమర్శించడం మొదలు పెట్టాడు. ఛానల్స్ కి లైవ్ కాల్స్ లో కనెక్ట్ అవుతూ కౌశల్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. కౌశల్ గెలిచిన తర్వాత కౌశల్ ఆర్మీ ఫేక్ అని.. బిగ్ బాస్ యాజమాన్యం ఫేక్ ఓట్స్ తో కౌశల్ కి పట్టం కట్టారని బాబు గోగినేని చిన్న పిల్లాడిలా గెంతుతూనే ఉన్నాడు. అయితే తాజాగా బాబు గోగినేని స్టార్ మా బిగ్ బాస్ సీజన్ 2 ఓటింగ్ లో అవకతవకలపై ఇప్పుడు కొన్ని రుజువులు బయటికొచ్చినుందన వీటిపై నాని స్పందించాలని అయన అభిపాయపడుతున్నారు. మరి బిగ్ బాస్ సీజన్ 2 ముగిసిపోయినా నానికి ఇంకా ఆ బిగ్ బాస్ తలనొప్పి పోయేలా కనబడడం లేదు.

Tags:    

Similar News