భీష్మ కళకళలు!!

నితిన్ – రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ టాక్ తో పాజిటివ్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. భీష్మా మొదటి [more]

Update: 2020-02-24 10:46 GMT

నితిన్ – రష్మిక మండన్న జంటగా వెంకీ కుడుములు దర్శకత్వంలో తెరకెక్కిన హిట్ టాక్ తో పాజిటివ్ కలెక్షన్స్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. భీష్మా మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ రాబట్టగా.. రెండవ రోజు కళకళలాడింది. రెండో రోజు కలెక్షస్న్ తో పోలిస్తే ఆదివారం భీష్మ కలెక్షన్స్ బావున్నాయి. మూడవ రోజు భీష్మ 4.37 కోట్లు వసూలు చేసింది. ఇక భీష్మ ఫస్ట్ వీకెండ్ లో మొత్తం తెలుగు రాష్ట్రాల్లో 14.89 కొల్లగొట్టగా.. ప్రపంచవ్యాప్తంగా 18.89 కోట్ల కలెక్షన్స్ తో భీష్మ దూసుకుపోతుంది. అయితే భీష్మ ప్రీ-రిలీజ్ బిజినెస్ చూస్తే… భీష్మా 3 రోజుల్లోపు లాభాల జోన్లోకి ప్రవేశిస్తుందని ట్రేడ్ నిపుణుల అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఓవర్సీస్ లో భీష్మ బ్రేక్ ఈవెన్ కి చేరుకుంది. ఇది ఓవర్సీస్ లో రెండు రోజుల్లోనే అర మిలియన్ మార్కును దాటింది. అలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా, భీష్మా కొన్ని ప్రాంతాల్లో బ్రేక్ఈవెన్ మార్కును చేరుకుంది.

ఏరియా షేర్ (కోట్లలో )

నైజాం 5.93
సీడెడ్ 2.24
నెల్లూరు 0.48
కృష్ణ 0.92
గుంటూరు 1.37
వైజాగ్ 1.79
ఈస్ట్ గోదావరి 1.20
వెస్ట్ గోదావరి 0.88
టోటల్ ఏపీ & టీస్ షేర్ 14.89
ఇతర ప్రాంతాలు 1.50
ఓవర్సీస్ 2.50
టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 18.89 కోట్లు

Tags:    

Similar News