శంకర్ వల్లే భారతీయుడు 2 ఆగిపోయిందా..?

ఒకప్పుడు తమిళ దర్శకుడు శంకర్ అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండేవి. ఒక భారతీయుడు, ఒక జంటిల్మెన్ వంటి శంకర్ కళాఖండాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉండేవారు. కానీ [more]

Update: 2019-03-12 07:20 GMT

ఒకప్పుడు తమిళ దర్శకుడు శంకర్ అంటే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉండేవి. ఒక భారతీయుడు, ఒక జంటిల్మెన్ వంటి శంకర్ కళాఖండాలకు పిచ్చ ఫ్యాన్స్ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి తారుమారైంది. ఐ లాంటి భారీ బడ్జెట్ చిత్రం, 2.ఓ లాంటి భారీ బడ్జెట్ చిత్రాలు చూసాక శంకర్ లో పస తగ్గిందా అని ఆయన అభిమానులకే అనిపిస్తుంది అంటే.. పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్ధం చేసుకోవాలి. భారీ బడ్జెట్ చిత్రాలు చెయ్యడం అలవాటయ్యాక చిన్నా, మీడియం చిత్రాలను చెయ్యాలంటే కాస్తంత కష్టమే. అందుకే శంకర్ బడ్జెట్ ని అదుపులో పెట్టుకోలేక నానా తంటాలు పడుతున్నాడు. ఇక శంకర్ ని నమ్మి కోట్లకు కోట్లు పెట్టుబడి పెట్టిన లైకా వారు ఇప్పుడు శంకర్ ని నమ్మడం లేదు.

2.ఓ నష్టాలతో తేరుకున్న నిర్మాతలు

2.ఓ ని 550 కోట్లు పెట్టి లైకా వారు నిర్మించారు. శంకర్ అడిగింది కాదనకుండా ఇచ్చారు. కానీ ఆ సినిమాతో లైకా ప్రొడక్షన్స్ మునిగిపోయింది. 100 కోట్లపై మాటే నష్టాలొచ్చాయి. ఇక దిల్ రాజు శంకర్ దెబ్బకి జడిసి భారతీయుడు 2 సినిమాని భారీగా అనౌన్స్ చేసి మరీ తప్పుకున్నాడు అయితే 2.ఓ తీస్తున్నప్పుడు శంకర్ మేకింగ్ స్టయిల్ నచ్చిన లైకా వారు భారతీయుడు 2ని టేకప్ చేసి… ఆ సినిమాని కమల్ హీరోగా నిర్మించడానికి రెడీ అయ్యారు. అయితే భారీ బడ్జెట్ అనుకున్నాకే భారతీయుడు 2 పట్టాలెక్కింది. కానీ 2.ఓ నష్టాలు చూసాక లైకా వారు మేల్కొన్నారు. ఇక బడ్జెట్ కంట్రోల్ తప్పనిసరి అని శంకర్ కి వార్నింగ్ ఇస్తూ వస్తున్నారు. కానీ శంకర్ మాత్రం ఎవరినీ లెక్కచెయ్యకుండా బడ్జెట్ ని ఎప్పటిలాగే పెంచుకుంటూ వస్తున్నాడట.

షూటింగ్ ఆపేశారా..?

మొద‌టి షెడ్యూల్ షూటింగ్ కోసం అనుకున్న బ‌డ్జెట్‌ కంటే ఎక్కువ అవ్వడంతో లైకా వారు శంకర్ తో వాదనకు దిగగా… అది నచ్చని శంకర్ మధ్యలో మరో నిర్మాతలతో భారతీయుడు 2 చెయ్యడానికి కూడా రెడీ అయ్యాడు. కానీ మరో నిర్మాత దొరక్కపోవడంతో.. శంకర్ లైకా వారు చెప్పిన కండీషన్స్ కి తలొగ్గి చిత్రీకరణ మొదలు పెట్టాక కూడా శంకర్ లో మార్పు రాకపోవడంతో లైకా ప్రొడక్షన్స్ వారు భారతీయుడు 2 షూటింగ్ ని నిలిపేసినట్లుగా వార్తలొస్తున్నాయి. మరి ఫైనల్ గా భారతీయుడు 2 ఉంటుందో లేదో అనేది మాత్రం ప్రస్తుతానికి భారీ అనుమానం.

Tags:    

Similar News