‘భారతీయుడు 2’ వార్తలపై క్లారిటీ..!

కమల్ హాసన్ – ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు [more]

Update: 2019-02-20 08:41 GMT

కమల్ హాసన్ – ఇండియన్ ప్రైడ్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన భారతీయుడు ఎంత పెద్ద హిట్ అయిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్ లో ‘భారతీయుడు 2’ వస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా షూటింగ్ స్టార్ట్ చేసుకున్న ఈ సినిమా గురించి గత కొన్ని రోజుల నుండి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా ఆగిపోయిందని… శంకర్ ఈ చిత్రానికి భారీ బడ్జెట్ ను కోట్ చేశాడట అందుకే లైకా అందుకు ఒప్పుకోకపోవడంతో ఇద్దరి మధ్య విభేదాలు వచ్చి సినిమా ఆగిపాయిందని వార్తలు వస్తున్నాయి.

వచ్చే ఏడాది విడుదల

అయితే ఈ వార్తలపై తాజాగా క్లారిటీ వచ్చింది. ఈ సినిమా ఆగిపోలేదని ఇప్పటికే రెండు ముఖ్యమైన షెడ్యూల్స్ పూర్తి అయ్యాయని, త్వరలోనే మరో భారీ షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నామని లైకా ప్రతినిధి స్పష్టం చేశారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Tags:    

Similar News